Home » రమ్మంటే రావే రాధమ్మ (Rammante rave Radhamma) సాంగ్ లిరిక్స్ – Folk Song 

రమ్మంటే రావే రాధమ్మ (Rammante rave Radhamma) సాంగ్ లిరిక్స్ – Folk Song 

by Lakshmi Guradasi
0 comments

నీలాల నింగిలో మెరిసింది చుక్క
నీకోసమే వేసా పూల చొక్కా
నా గుండెల్లో నిన్ను దాచుకుంటా

రావే రాధమ్మ
రమంటే రావే రాధమ్మ
నిండు జాబిలి నువ్వమ్మ
నువ్వంటే జాలే రాధమ్మ
ఉండిపోనా నీతో ఈ జన్మ

నల్లని మబ్బుల చాటు చందురూడా
నా మనస్సు దోచిన మన్మథుడా
నీ పిలుపు కోసం ఇన్నాళ్లు వేచినా

రారా కిట్టయ్య
రమంటే రానా కిట్టయ్య
నీతో ఉండిపోనా చెప్పయ్యా
నిన్ను కోరుకున్న కిట్టయ్య
నువ్వంటే పిచ్చి ప్రేమయ్యా

నువ్వు గాని నా తోడు ఉంటే
దేవతల్లే రోజు పూజ చేస్తా
ఓ పూట నిన్ను చూడకుంటే
నేను ఆగమాగమైపోతా

ఎందుకంతా నాపై ప్రేమ
నేను నీకు అంత నచ్చిననా
ఎప్పుడు లేనిది నాకు
అంతా వింతగా ఉంది ఈ మాయ

లంగఓణిలోన లడ్డులాగా ఉన్న
రెండు జడల పాప
నచ్చినవే ఎదను గిచ్చినావే
ఇంకా పెట్టాలే నువ్ కేక

మాయదారి మాటలెందుకయ్యా
మనస్సు మనస్సు కలిసినాక
నచ్చిన చిన్నది మెచ్చిన కోరిక
తీర్చాలి రా ఇక

నా ప్రాణం నువ్వే రాధమ్మ
ఏ కష్టం రానీయనమ్మ
నా లోకం నువ్వే కిట్టయ్య
ఎప్పుడు నీ ధ్యాసేనయ్య

ప్రతి రోజు కలలోకొచ్చి
నన్ను కలవరపెడుతావమ్మా
నీ అందాలన్నీ ఆరబోసి ఆటపట్టిస్తావెందుకమ్మా

మాయమాటలెన్నో చెప్పి
నీ మైకం లో పడదోస్తివయ్యా
రెక్కల గుర్రం పై వచ్చి
నన్ను ఎత్తుకుపో సక్కనయ్యా

అందమైన నీ రూపం చూడ రెండు కళ్ళు చాలవంట
నువ్వు నేను జంట
నిన్ను ఏలుకుంట
కలిసుంటా కడదాకా

నీ ఇంటి వెలుగై
నీ కంటి మెరుపై
నీతోడు నేనుంటా
అలిసిపోయి నువ్వు ఇంటికొస్తే
అమ్మలాగా ఆదరిస్తా

నన్ను చేరినాది రాధమ్మ
నాలో నిండినాది నీ బొమ్మ
నా ధైర్యం నీవే కిట్టయ్య
నువ్వుంటే ఇంకేంవద్దయ్యా

నన్ను చేరినాది రాధమ్మ
నాలో నిండినాది నీ బొమ్మ
నిన్ను చేరినాది రాధమ్మ
నువ్వంటే పిచ్చి ప్రేమయ్యా

______________________________________

పాట: రమ్మంటే రావే రాధమ్మ (Rammante rave Radhamma)
సాహిత్యం : అనితా నాగరాజ్ (Anitha Nagaraj )
గాయకులు: బొడ్డు దిలీప్ ( Boddu Dileep ) & బట్టు శైలజ (Battu Shailaja)
సంగీతం: రవి కళ్యాణ్ (Ravi Kalyan)
తారాగణం: కార్తీక్ రెడ్డి (Karthik Reddy ) & చెర్రీ అన్షిక (Cherry Anshika)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.