విచిత్రాల ఈ ప్రేమ ఏ అంతరాలు ఎంచదమ్మా
మనసొక్కటే జన్మస్థానం అంటూ కొత్త కథలాగా మొదలైతదమ్మా
బోట్టు పెట్టుకు చందమామ ఈ నేల మీద పుట్టెనమ్మా
అడుగు మోపుతుంటే గొడుగులాగా మారి
పులా కొమ్మలు వంగెనమ్మా
అందాల ఓ ముద్దుగుమ్మా గుండె గీసుకున్నదే నీ బొమ్మ
ప్రాణమల్లే నాకు తోడు వస్తే నీకు రాసిస్తా ప్రతి ఒక్క జన్మ
నువ్వంటే చచ్చేంత ప్రేమ అది మాటల్లో చెప్పలేనమ్మా
నీ జంట కోసం చితిమంటదాక అడుగుల్లో అడుగేస్తానమ్మా
మూసి మూసి నవ్వుల్లో ముత్యాలు ఒలుకంగా..
మూసి మూసి నవ్వుల్లో ముత్యాలు ఒలుకంగా
తొలిసారి నీ చూపు తనువరా తాకంగా
పొంగిందే నాలోని పచ్చి ప్రేమల గంగా
రాంబాయి నీ మీద నాకు మనసాయనే
ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే
రాంబాయి నీ మీద నాకు మనసాయనే
మదిలోన నిన్ను వీడిపోని నీడైతనే
బోట్టు పెట్టుకు చందమామ ఈ నేల మీద పుట్టెనమ్మా
అడుగు మోపుతుంటే గొడుగులాగా మారి
పులా కొమ్మలు వంగెనమ్మా
విచిత్రాల ఈ ప్రేమ ఏ అంతరాలు ఎంచదమ్మా
మనసొక్కటే జన్మస్థానం అంటూ కొత్త కథలాగా మొదలైతదమ్మా
రాజ్యమేది లేదుగాని రాణిలాగా చూసుకుంటా
కోటకట్టలేను గాని కళ్ళలో నిన్నే దాచుకుంటా
రాత ఎట్లా రాసి ఉన్నా అమార్చి నీతో రాసుకుంటా
స్వర్గమంటూ ఉన్నదంటే అది నీతోనే ప్రతిరోజు పంచుకుంటా
నిన్నుగన్న మీ నాన్నకంటే అల్లారు ముద్దుగా సాదుకుంటా
నీకు కోపం వస్తే కొంత దూరముంటా నువ్వు గీత గీస్తే నేను దాటనంటా
కంట నీరు కంటి రెప్ప దాటకుండా కాటుకై కావాలంటా..
రాంబాయి నీ మీద నాకు మనసాయెనే
ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే
ఓ రాజు నీ మీద నాకు మనసాయెరా
మదిలోన నన్ను వీడిపోని నీడైతివిరా
రాంబాయి నీ మీద నాకు మనసాయనే
మదిలోన నిన్ను వీడిపోని నీడైతనే
విచిత్రాల ఈ ప్రేమ.. ఏ అంతరాలు ఎంచదమ్మా
మనసొక్కటే జన్మస్థానం అంటూ కొత్త కథలాగా మొదలైతదమ్మా
బోట్టు పెట్టుకు చందమామ ఈ నేల మీద పుట్టెనమ్మా
అడుగు మోపుతుంటే గొడుగులాగా మారి
పులా కొమ్మలు వంగెనమ్మా
English Version:
Vichitralaa ee prema ye antharaalu enchadamma
Manasokkate janmasthaanam antu kottha kathalaga modalaitadamma
Bottu pettuku chandamaama ee nela meeda puttenamma
Adugu moputunte godugulaaga maari
Pula kommala vangenamma
Andaala o muddugumma gunde geesukunnade nee bomma
Praanamalle naaku thodu vaste neeku raasistaa prathi okka janma
Nuvvante chache anta prema adi maatallo cheppalenamma
Nee janta kosam chitimantadaka adugullo adugestaanamma
Moosi moosi navvullo muthyaalu olukanga
Moosi moosi navvullo muthyaalu olukanga
Tholisari nee choopu tanuvara taakanga
Ponginde naaloni pachchi premala ganga
Raambaayi nee meeda naaku manasaayane
Enaadu ninnu veediponi needaithane
Raambaayi nee meeda naaku manasaayane
Madilona ninnu veediponi needaithane
Bottu pettuku chandamaama ee nela meeda puttenamma
Adugu moputunte godugulaaga maari
Pula kommala vangenamma
Vichitralaa ee prema ye antharaalu enchadamma
Manasokkate janmasthaanam antu kottha kathalaga modalaitadamma
Raajyamedi ledugaani raanilaaga choosukunta
Kotakattalenu gaani kallalo ninne daachukunta
Raatha etlaa raasi unna maarachi neetho raasukunta
Swargamantoo unnadante adi neethone pratiroju panchukunta
Ninnuganna mee naannakante allaari mudduga saadukunta
Neeku kopam vaste kontha dooramunta nuvvu geetha geesthe nenu daatananta
Kanta neeru kanti reppa daatakunda kaatukai kaavalanta
Raambaayi nee meeda naaku manasaayene
Enaadu ninnu veediponi needaithane
O raaju nee meeda naaku manasaayera
Madilona nannu veediponi needaithivira
Raambaayi nee meeda naaku manasaayane
Madilona ninnu veediponi needaithane
Vichitralaa ee prema ye antharaalu enchadamma
Manasokkate janmasthaanam antu kottha kathalaga modalaitadamma
Bottu pettuku chandamaama ee nela meeda puttenamma
Adugu moputunte godugulaaga maari
Pula kommala vangenamma
_______________
Song Credits:
సాంగ్ : రాంబాయి నీ మీద నాకు (Rambai Neemeedha Naku)
చిత్రం: రాజు వెడ్స్ రాంబాయి (Raju Weds Rambai)
గాయకులు: అనురాగ్ కులకర్ణి (Anurag Kulkarni), జయశ్రీ పల్లెం (Jayasri Pallem)
నటీనటులు : అఖిల్ రాజ్ ఉద్దెమరి (Akhil Raj Uddemari), తేజస్వీ రావు (Tejaswi Rao),
సంగీత దర్శకుడు: సురేష్ బొబ్బిలి (Suresh Bobbili)
సాహిత్యం: మిట్టపల్లి సురేందర్ (Mittapally Surendar)
రచన & దర్శకత్వం : సాయిలు కంపాటి (Saailu Kaampati)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.
