Home » రామయ్య ఆవు – నీతి కథ

రామయ్య ఆవు – నీతి కథ

by Haseena SK
0 comment

రామయ్య దగ్గర ఒక ఆవు వుండేది. అది దండిగా పాలు ఇచ్చేది. ఆవును ఎంతో శ్రద్దగా మేత కుడితి పెట్టి జాగ్రత్తగా చూసుకునేవాడు. 

అంతేగాక ఆవును దైవ స్వరూపంగా భావించి ప్రతి శుక్రవారం దానికి స్నానం చేయించి. పసుపు కుంకుమలతో పూజ చేసి హరితి ఇచ్చేవాడు.

 ఆవుకొన్నాళ్ళకు దూడను ఈనింది. రామయ్య ఎంతగానో సంతోషించాడు. పాల దిగుబడి మరింతగా పెరిగింది.

కానీ ఒక రోజు ఆ ఆవు తప్పిపోయింది. ఎంత వెతికినా దొరకలేదు. రామయ్య చాలా విచారించాడు దూడ కూడా తల్లి కోసం దిగులు పడింది.

దాంతో రామయ్య ఒక ఉపాయం ఆలోచించి నా ఆవు తప్పిపోయింది. దాన్ని తెచ్చి ఇచ్చిన వాళ్లకు దూడను కూడా ఇచ్చేస్తాను. ಅನಿ దండోరా వేయించాడు. దూడ కోసం ఆశపడిన గోపన్న అనే వ్యక్తి తన కొట్టంలో కట్టేసుకున్నా ఆ ఆవును తీసుకుని రామయ్య దగ్గరికి వచ్చాడు. 

ఆవును తెచ్చాను దూడను కూడా ఇస్తే తీసుకుపోతాను అన్నాడు. దూడును గుర్తు పట్టిన ఆవు గోపన్నను ఒక తన్ను తన్ని దూడ దగ్గరికి పరుగెత్తింది. నడుము విరిగిన గోపన్న లబోదిబోమన్నాడు. రామయ్య తన ఆవు తనకు దక్కినందుకు దూడను తల్లికి దోరికినందున సంతోషించారు.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.

You may also like

Leave a Comment