Home » రామసక్కని సూపులోడే (Ramasakkani supulode) సాంగ్ లిరిక్స్ – Folk Song

రామసక్కని సూపులోడే (Ramasakkani supulode) సాంగ్ లిరిక్స్ – Folk Song

by Lakshmi Guradasi
0 comment

రామసక్కని సూపులోడే
రవ్వల దుగ్గిలు తెచ్చినాడే
పున్నమి ఘడియల చందురుడే
పూవ్వుల వాసనకు వచ్చినాడే

వాని చక్కని సూపుల
చెక్కెర తీపికి చుక్కలే ధాటినట్టుందే
గుప్పెడు గుండెలో ప్రేమలు కొట్టిన
గంటలే మోగినట్టుందే
గాయి గాయి తిరుగుతుందే ప్రాణం
గంప కింద గమ్ముతాందే

రామసక్కని సూపులోడే
రవ్వల దుగ్గిలు తెచ్చినాడే
పున్నమి ఘడియల చందురుడే
పూవ్వుల వాసనకు వచ్చినాడే

నల్లని కన్నుల మన్మథుడే
నవ్వుల బాణాలు వేసినాడే
హద్దుల దాటని అల్లరోడే
ముద్దుల తోటకు పిలిచినాడే

వాని అత్తరు సెంటు సోకులకు
మత్తు మందుల ముంచినట్టుందే
ఎన్నడూ చూడని వింత లోకాలన్నీ
కొత్తగా చూసినట్టుందే
గాయి గాయి అంటావుండే ఈడు
దారి తప్పి పోతావుందే

రామసక్కని సూపులోడే
రవ్వల దుగ్గిలు తెచ్చినాడే
పున్నమి ఘడియల చందురుడే
పూవ్వుల వాసనకు వచ్చినాడే

వెన్నెల దారుల్లా వన్నెగాడే
వేకువ జామున కలిసినాడే
గాబురాల ముద్దు పిల్లగాడే
గారడి మాయలు చేసినడే

వాని అడుగుల సప్పుడు
అర్దుమ రాత్రి నిదుర లేపినట్టుందే
పచ్చని పైరులా వెచ్చని గాలులు
పరువులా తాకినట్టుందే
గాయి గాయి మత్తుగుందే ఒళ్ళు
సోయ తప్పి పోతావుండే

రామసక్కని సూపులోడే
రవ్వల దుగ్గిలు తెచ్చినాడే
పున్నమి ఘడియల చందురుడే
పూవ్వుల వాసనకు వచ్చినాడే

బంగారు నవ్వుల చిన్నవాడే
బావంటూ బంధాలు కలిపినాడే
ఆ నీలి మబ్బుల అందగాడే
అందరి మనసులు గెలిచినాడే

వాని నవ్వుల తీరుకు
వాగులు వంకలు పొంగి పొర్లినట్టుగుండే
ఆ వాన చినుకులు అందాల మెరుపులు
కన్నులే గీటినట్టుందే
జోరు జోరు జారుతుందే కొంగు
జోడి ఏదని అడుగుతుందే

నచ్చిన ముద్దుల పిల్లగాడా
నీతోనే మనువాడుకుంటాను రా
గుండెల్లో నిండిన బావగాడా
గువ్వా గోరింకోలే తోడుంటారా

నచ్చిన ముద్దుల పిల్లగాడా
నీతోనే మనువాడుకుంటాను రా
గుండెల్లో నిండిన బావగాడా
గువ్వా గోరింకోలే తోడుంటారా

___________________________________________

పాట: రామసక్కని సూపులోడే (Ramasakkani supulode)
సాహిత్యం – మహేందర్ ముల్కల (Mahender Mulkala)
సంగీతం – కళ్యాణ్ కీస్ (Kalyan Keys)
గాయని – వాగ్దేవి (Vagdevi)

మర్రిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment