పాణలే పోతున్న మరువనే
పట్టుకున్న సెయ్యి విడువనే
ఒట్టు పెట్టి సెప్పుతున్ననే
పూస్తే కట్టి ఏలుకుంటానే
మనసు గళ్ళ మా లచ్చిమి
పిల్లో రామ లచ్చిమి
బాధల్లో తోడుండే బంధమే
కోరుకున్నది ప్రాణమే
అందరం కలిసుంటేనే
మంద బలము బాగుంటది
మావోళ్లను ఒప్పియ్ ఓ పిల్లగో
నీ ఇంటి దానినైతను నా పిల్లగో
గంత రంధి నీకెందుకే
గుంజకు ఒరిగి కూసుంటివే
గట్ల బాధ పడితే ఎట్లనే
గుండా నిండ నిన్ను ధాత్తినే
నిన్ను ఎవరేమి అన్నారే పిల్లో రామ లచ్చిమి
సూటి పోటీ మాటలు సూదుల్లల్లే గుచ్చుతున్నాయే
మాట బయట పడకుంటేనే మంచి పేరు మనకుంటది
మనసు చూసి నిన్ను మెచ్చిన మాట దాటకు ఓ పిల్లగా
మనసు నిండ రామ లచ్చిమి
మా ఇంటి మా లచ్చిమి
మూతి ముడిచి నువ్ ఉండకే
మందలించి మాట్లడవే
నవ్వుతు నువ్ ఉండవే
రోజంతా ఇక పండుగే
చాలు చాలు నీ మాటలు
దాటుతున్నాయి కోటలు
కుయ్యకు నీ కూతలు
తిండి పెట్టు మూడు పూటలు
నవ్వుకుంటూ నేనుంటే
నాకేం ఇస్తావ్ నా పిల్లగా
పొద్దుతీరు ముద్దుగున్నవే
బుద్ధితీర చూసుకుంటానే
బంగారు నా ఎండి కొండవే
బంగారం నీకు తెత్తనే
ఏడు జన్మల బంధమే
ఎందుకంత అనుమానమే
ఎవరు ఒపుకోకున్న ఏ బలగం లేకున్న
నీతో రావాలనుకున్న నువ్వే అన్ని అనుకున్న
అనుమానమేమి లేదులే అందరోలే నేను కాదులే
అత్త మామలు మెచ్చిరే
అంత కన్న ఏమి ఎక్కువే
ఏలు పట్టుకుని తిరగవే
ఏడు అడుగులేసి నడువవే
ఎంత మంచి అత్త మామలే
వెన్నెలాంటి మనసు వాణ్నన్నే
రాముని లాంటి రాజువే
సీతల్లే నీ దానినే కట్న కానుకలు లేవులే
కంటి నిండ చూసుకుంటలే
అడుగులో నా అడుగేత్తలే
అంతులేని ప్రేమ నీదేలే
_____________________
లిరిక్స్: భాను NN
సంగీతం : మహేందర్ శ్రీరాముల
గాయకులు : నాగలక్ష్మి, భాను NN
తారాగణం : స్నేహ శర్మ, సుష్మ రౌడీ, భాను ఎన్ఎన్, రాజు కెకె, రాధాకృష్ణ
కథ – స్క్రీన్ ప్లే – దర్శకుడు – పోస్టర్లు : భాను NN
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.