సంకురాతిరేలా ముగ్గేసినట్టు
సందేవేళ పొద్దు రంగేసినట్టు
సంధు చూసి ఏరు పొంగేసినట్టుందే
సందమామ తోటి పెగ్గేసినట్టు
సల్లగాలి వచ్చి హగ్గించినట్టు
సెప్పలేని సిగ్గు మొగ్గేసినట్టుందే…
గుండె పట్టిలాగినట్టుగుందే
తేనెటీగ కుట్టినట్టుగుందే
నువ్వు పక్కనుంటే పిల్లా చుట్టుపక్కలంత జాతర లెక్కుందే
అల్లో నేరేడల్లో పిల్లా కల్లోకొచ్చిందిరో ..
తెల్ల తెల్లవారే కల్లా దిల్లోకి దూరిందిరో..
ఏయ్ సక్కరా లాంటి నీ నవ్వు చూస్తే సక్కరోచినాదేయ్..
టన్నులకొద్ది నీ పై ప్రేమ తన్నుకొచ్చినాదే
ఏయ్ కన్నుల ముందర సిందర వందర గాందర గోలలేయ్…
నీ చున్నీకి చివ్వర చుట్టేసుకున్నావే నా పంచ ప్రాణాలే
ఏయ్ ఎర్రని బొట్టు నువ్వు పెట్టుకుంటే ఏడెక్కే మందరాలే
హే నీ మత్తు చానా గమ్మత్తుకుందే నా యావత్తు నీ సోత్తులే..
గిర్ర గిర్ర రంగుల రాట్నంలా నా బుర్ర తిప్పేసావే
అల్లో నేరేడల్లో పిల్లా కల్లోకొచ్చిందిరో ..
తెల్ల తెల్లవారే కల్లా దిల్లోకి దూరిందిరో..
సంకురాతిరేలా ముగ్గేసినట్టు
సందేవేళ పొద్దు రంగేసినట్టు
సంధు చూసి ఏరు పొంగేసినట్టుందే
సందమామ తోటి పెగ్గేసినట్టు
సల్లగాలి వచ్చి హగ్గించినట్టు
సెప్పలేని సిగ్గు మొగ్గేసినట్టుందే…
గుండె పట్టిలాగినట్టుగుందే
తేనెటీగ కుట్టినట్టుగుందే
నువ్వు పక్కనుంటే పిల్లా చుట్టుపక్కలంత జాతర లెక్కుందే
ఏయ్ అల్లో నేరేడల్లో పిల్లా కల్లోకొచ్చిందిరో ..
తెల్ల తెల్లవారే కల్లా దిల్లోకి దూరిందిరో..
________________
సాంగ్ : అల్లో నేరేడల్లో పిల్ల (Allo Neredallo Pilla)
చిత్రం: బాపు (Baapu)
గాయకుడు: రామ్ మిర్యాల (Ram Miryala)
సంగీతం: RR ధ్రువన్ (RR Dhruvan)
లిరిక్స్ : రఘురాం (Raghuram)
రచన మరియు దర్శకత్వం: దయ (Daya)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.