ప్రియతమా నను పలకరించు ప్రణయమా
అథిధిలా నను చేరుకున్న హృదయమా
బ్రతుకులోని బంధమా పలుకలేని భావమా
మరువలేని స్నేహమా మరలిరాని నేస్తమా
ప్రియతమా .. ప్రియతమా .. ప్రియతమా…
ప్రియతమా నను పలకరించు ప్రణయమా
అథిధిలా నను చేరుకున్న హృదయమా
ఎదుటవున్న స్వర్గమా చెదిరిపోని స్వప్నమా
కనులలోని కావ్యమా కౌగిలింత ప్రాణమా
ప్రియతమా .. ప్రియతమా .. ప్రియతమా…
ప్రియతమా నను పలకరించు ప్రణయమా
నింగివీణకేమొ నేలపాటలొచ్చె తెలుగు జిలుగు అన్నీ తెలిసి
పారిజాతపువ్వు పచ్చి మల్లె మొగ్గ వలపె తెలిపె నాలొ విరిసి
మచ్చలెన్నో ఉన్న చందమామ కన్నా నరుడే వరుడై నాలొ మెరిసె
తారలమ్మకన్నా చీరకట్టుకున్న పడుచుతనమే నాలో మురిసె
మబ్బులన్ని వీడిపోయి కలిసె నయనం తెలిసె హృదయం
తారలన్ని దాటగానె తగిలే గగనం రగిలే విరహం
రాయలేని భాషలో ఎన్ని ప్రేమలేఖలో
రాయిలాంటి గొంతులో ఎన్ని మూగపాటలో
అడుగే పడకా గడువే గడిచి పిలిచె
ప్రియతమా నను పలకరించు ప్రణయమా
అథిధిలా నను చేరుకున్న హృదయమా
ప్రాణవాయువేదొ వేణువూదిపోయె సృతిలొ జతిలొ నిన్నె కలిపి
దేవగానమంత యెంకిపాటలాయె మనసు మమత అన్నీ కలిసి
వెన్నెలల్లే వచ్చి వేదమంత్రమాయె బహుసా మనసా వాచా వలచి
మేనకల్లె వచ్చి జానకల్లే మారి కులము గుణము అన్ని కుదిరి
నీవులేని నింగిలోన వెలిగే ఉదయం విధికే విలయం
నీవులేని నేలమీద బ్రతుకే ప్రళయం మనసే మరణం
వానవిల్లు గుండెలో నీటికెన్ని రంగులో
అమృతాల విందులో ఎందుకిన్ని హద్దులో
జగమే అణువై యుగమే క్షణమై మిగిలే
ప్రియతమా నను పలకరించు ప్రణయమా
అథిధిలా నను చేరుకున్న హృదయమా
బ్రతుకులోని బంధమా పలుకలేని భావమా
కనులలోని కావ్యమా కౌగిలింత ప్రాణమా
ప్రియతమా .. ప్రియతమా .. ప్రియతమా…
ప్రియతమా నను పలకరించు ప్రణయమా
అథిధిలా నను చేరుకున్న హృదయమా
పాట పేరు: ప్రియతమా (Priyatama)
సినిమా పేరు: జగదేకవీరుడు అతిలోకసుందరి (Jagadeka Veerudu Athiloka Sundari)
గానం: ఎస్.పి. బాలసుబ్రమణ్యం (S.P. Balasubramanyam), ఎస్ జానకి (S Janaki)
సాహిత్యం: వేటూరి సుందర రామమూర్తి (Veturi Sundara rama murthy)
సంగీతం: ఇళయరాజా (Illayaraja)
దర్శకుడు: కె రాఘవేంద్ర రావు (K Raghavendra rao)
తారాగణం: చిరంజీవి (Chiranjeevi), శ్రీదేవి (Sridevi) అమ్రిష్ పురి (Amrish Puri), అల్లు రామలింగయ్య (Allu Ramalingaiah), బ్రహ్మానందం (Brahmanandam) తదితరులు
👉 ఇంకా ఇలాంటి లేటెస్ట్ పాటలు కావాలంటే తెలుగురీడర్స్ ని ఫాలో అవ్వండి ! అలాగే మీకు నచ్చిన పాట ఏదైనా ఉంటే కామెంట్లో పేరు చెప్పండి – మేము దాన్ని త్వరగా మీకు అందించే ప్రయత్నం చేస్తాం!