Home » ప్రేమంటే సులువు కాదురా – ఖుషి 

ప్రేమంటే సులువు కాదురా – ఖుషి 

by Hari Priya Alluru
0 comments
premante suluvu kadura

ప్రేమంటే సులువు కాదురా అది నీవు గెలవలేవురా

ప్రేమించే షరతులేమిటో అందులోని మర్మమేమిటో

ప్రేమెంతో విలువ అయినది అందరికి దొరకలేనిది

చూసేందుకు చక్కనైనది తాకావ భగ్గుమంటది

నోనోనో అలా చెప్పకు మనసుంటే మార్గముంటది

సయ్యంటే చేసి చూపుతా లోకానికి చాటి చెప్పుతా

జాబిలినీ బొమ్మగ చేసిస్తావా

భూలోకం చుట్టి సిగలో తురిమేస్తవా

మబ్బుల్లో మల్లెల పరుపేస్తావా

ఆకశం దిండుగ మార్చేస్తావా

తెస్తావా తెస్తావా తెస్తావా

సూర్యుడ్నే పట్టి తెచ్చెద నీ నుదుటన బొట్టి పెట్టెద

చుక్కలతో చీర కట్టెద మెరుపులతో కాటుకెట్టెదా

తాజ్మహలే నువ్వు కట్టిస్తావా

నా కోసం నయాగర జలపాతం తెస్తావా

ఎవరెస్టు శిఖరమెక్కిస్తావా

పసిఫిక్కు సాగరమీదేస్తావా

వస్తావా తెస్తావా తెస్తావా

స్వర్గానే సృస్టి చేసేద నీ ప్రేమకు కానుకిచ్చెద

కైలాసం భువికి దించెద నా ప్రేమను రుజువు చేసేదా

ప్రేమంటే సులువు కాదురా అది నీవు గెలవలేవురా

ప్రేమించే షరతులేమిటో అందులోని మర్మమేమిటో

ప్రేమెంతో విలువ అయినది అందరికి దొరకలేనిది

చూసేందుకు చక్కనైనది తాకావో భగ్గుమంటది

నోనోనో అలా చెప్పకు మనసుంటే మార్గముంటది

సయ్యంటే చేసి చూపుతా లోకానికి చాటి చెప్పుతా

మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.