ప్రాణం కన్నా ప్రేమించిన
ఆ ప్రేమనే తెంచావుగా
మేఘాలు ధాటినాక
దూరాలు సాగినాక
నన్నింకా వీడమంటూ పోమందిగా…
ఆ బంధం అబద్దమా…
ఆ స్నేహం అబద్దమా …
నీ తోనే నా ఊహలే అబద్దమా …
ఆ కాలం అబద్దమా …
ఆనందం అబద్దమా …
నడిచేటి ఆ దారులే అబద్దమా ….
నువ్వుంటే చాలంది ప్రాణం
ఉంటావా నా తోడుగా
చేశాలే ప్రయత్నమంతా
మౌనాలు విడవా
నువ్వుంటే చాలంది ప్రాణం
ఉంటావా నా తోడుగా
చేశాలే ప్రయత్నమంతా
మౌనాలు విడవా
ఎంత సంతోషమో
కొంత బాధుందిగా
ఒక్కసారైనా ప్రేమ నాపైన చుపించవా …
ఆ బంధం అబద్దమా…
ఆ స్నేహం అబద్దమా …
నీ తోనే నా ఊహలే అబద్దమా …
ఆ కాలం అబద్దమా …
ఆనందం అబద్దమా …
నడిచేటి ఆ దారులే అబద్దమా ….
కన్నులో తడేదో చూశా
కాదన్నా క్షణాలలో
ఏముందో మనసులోన
తెలిసేది నాకెలా
తప్పు నదున్నదా ఒప్పుకోనందిగా
గుండె లోతుల్లో ఉప్పెనౌతుందే
ఈ వేదనా ….
ఆ బంధం అబద్దమా…
ఆ స్నేహం అబద్దమా …
నీ తోనే నా ఊహలే అబద్దమా …
ఆ కాలం అబద్దమా …
ఆనందం అబద్దమా …
నడిచేటి ఆ దారులే అబద్దమా ….
________________________________
పాట – ప్రాణం కన్నా (Pranam Kanna)
గాయకులు – కైలాష్ ఖేర్ (Kailash Kher)
సాహిత్యం: కృష్ణకాంత్ (Krishna kanth)
సంగీతం: ప్రిన్స్ హెన్రీ (Prince Henry)
రచయిత & దర్శకుడు: స్మరణ్ రెడ్డి 9Smaran Reddy)
తారాగణం – అంజన్ రామచేంద్ర (Anjan Ramachendra), శ్రావణి కృష్ణవేణి (Shravani Krishnaveni)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.