మల్లి మల్లి నా గుండెలో
నీ బొమ్మే గీశానులే
ఆల్లి బిల్లి నీ నవ్వులో
నా ఊహే మెరిసెనులే
పండు వెన్నెల్లో వెండి మబ్బల్లే
అందంగున్నావే ఎద పైన వాలేవే
కంటి రెప్పల్లో కొంటే కల నువ్వై
నిదురే చెరిపే చెలివే
నా చెలివే….
నీ వల్లే నీ వల్లే
నాలో ఏదో మాయ చూశాలే
నీ వల్లే నీ వల్లే
నన్ను నేనుగా మరిచానే
మల్లి మల్లి నా గుండెలో
నీ బొమ్మే గీశానులే
ఆల్లి బిల్లి నీ నవ్వులో
నా ఊహే మెరిసెనులే
మనసే నీ మనసును చేరేనా
మదిలో ఈ పదనిస వరమౌనా
తడిమే మైమరుపులు ఆగేనా
కుదురుగా నా ప్రాణమే నిలుచుండెనా
వలపుల వర్షం ఇక మొదలైపోయే
తనువుల దూరం కనుమరుగైపోయే
మౌనం మాట్లాడేస్తూ నిన్ను అల్లేనేమో
అడగాలి అడగాలి ప్రేమనే
నీ వల్లే నీ వల్లే
నాలో ఏదో మాయ చూశాలే
నీ వల్లే నీ వల్లే
నన్ను నేనుగా మరిచానే
నీ వల్లే నీ వల్లే
నాలో ఏదో మాయ చూశాలే
నీ వల్లే నీ వల్లే
నన్ను నేనుగా మరిచానే
______________________________________
పాట పేరు : నీ వల్లే నీ వల్లే (Nee Valle Nee Valle)
గాయని: భావన (Bhavana)
రచయిత & దర్శకుడు – చందిన రవి కిషోర్ (Chandina Ravi Kishore)
నిర్మాత – ఎన్.పాండురంగారావు (N.Panduranga Rao)
సంగీతం – వినోద్ యజమాన్య (Vinod Yajamanya)
గీత రచయిత – గణేష్ (Ganesh), రాంబాబు గోసాల (Rambabu Gosala)
తారాగణం: వరలక్ష్మి శరత్ కుమార్ (Varalaxmi Sharath Kumar), సుదర్శన్ పరుచూరి (Sudarshan Paruchuri), శ్రీ దీక్ష (Sri Deeksha), నాజర్ (Nasar), రఘుబాబు (Raghubabu).
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.