పొడిచింది పొద్దు సెరిగింది బొట్టు వలవల ఏడుస్తుంటివీ
చెదిరింది గూడు మిగిలింది గోడు నీ తోడే వెళ్లిపోయినది
తల్లడిల్లి పోతున్నావే గుండెలు బాదుకుంటూ
తల్లి లా చూసే వాడే నీకే లేడంటూ
ఎన్నెన్ని బాధలే ఓ బంగారు మాలచ్చిమి నీకే
నీ నవ్వు చూసి నేను మురిసిపోయిన గాని ఆ నవ్వులేదే
నీ మంచి కోరి నేను దూరమైనా గాని ఎన్ని బాధలే
నీ నవ్వు చూసి నేను మురిసిపోయిన గాని ఆ నవ్వులేదే
నీ మంచి కోరే నీకు దూరమైనా గాని ఎన్ని బాధలే
గాజువాక గాజులు నీ చేతికే ఘళ్ళు ఘళ్ళు మన్నాయే
ఆ గాజులే పగిలిపోతుంటే నా గుండెనేమో ముక్కలైపోయిన్నాదే
కంచి పట్టుచీర కడితే సందమామ లెక్క సక్కగుంటవే
తెల్ల చీర కట్టే నువ్వు పది మందిలో ఎట్ట మెసరుకుంటావే
వాడి దగ్గరుందనీ పైసా…
పెళ్ళన్నారేమో బహుశా…
ఊరంతా కోడై కూయగా ఆఆఆ
కన్నీళ్లలో నీ బతుకు బాట
కట్టాలింక బాధలకోట
కష్టాలే నీ ఇంటి సుట్టాలుగా
నిండు ముత్తైదువుల మిల మిల మెరిసే నీ సిరునవ్వే
పెరుగువోయిన చీకటోలే సిన్నబోయెనే
నీ నవ్వు చూసి నేను మురిసిపోయిన గాని ఆ నవ్వులేదే
నీ మంచి కోరి నేను దూరమైనా గాని ఎన్ని బాధలే
నీ నవ్వు చూసి నేను మురిసిపోయిన గాని ఆ నవ్వులేదే
నీ మంచి కోరి నీకు దూరమైనా గాని ఎన్ని బాధలే
నుదిటి మీద కుంకుమ పెడితే
సూడనీకి రెండు కళ్ళు చాలవే
ఓడబోయిన నీమోమును అయ్యో నేను ఎట్ట సూద్దునే
బంగారు ఆభరణాలు నీ మెడలో ఎంత ముద్దుగుంటాయే
బోసిపోయే నీ మేడం మొత్తం ఉన్న తాళిబొట్టు తీసేశారే
మంటగలిసే నీ మాంగళ్యం
వెంట లేదే నీకే స్నేహం
ఎట్ట తట్టుకుంటద నీ ప్రాణం…
దేవునికే వచ్చిందో రోగం ఆరిపోయే నీ ఇంటి దీపం
మిగిలిందే శూన్యపు మౌనం..
నలుగురి చేతులు మీద జరిగినాదే నీ పెళ్లే
వాళ్లే నీ పసుపు కుంకాలు చెరిపేస్తున్నారే
నీ నవ్వు చూసి నేను మురిసిపోయిన గాని ఆ నవ్వులేదే
నీ మంచి కోరి నేను దూరమైనా గాని ఎన్ని బాధలే
నీ నవ్వు చూసి నేను మురిసిపోయిన గాని ఆ నవ్వులేదే
నీ మంచి కోరే నేను దూరమైనా నీకెన్ని బాధలే
______________
సాంగ్: పొడిచింది పొద్దు (Podisindi Poddu)
నిర్మాత: సునీతారెడ్డి (Sunitha Reddy)
దర్శకత్వం: దిలీప్ సాయి నాయక్ (Dileep Sai nayak)
సాహిత్యం: సిద్దూ యాదవ్ (Siddu Yadav)
సంగీతం : మదీన్ SK (Madeen SK)
గాయకుడు: హన్మంత్ యాదవ్ (Hanmanth Yadav)
నటీనటులు : కిట్టు పవన్ (Kittu pavan) & సిరి రావులాచారి (Siri Ravulachary) & రఘు (Raghu)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.