నీతోనే ఉంటే చాలే పిల్ల…
నిన్నొదిలి ఉండేదేన్నాళ్ళిలా..
నీతోనే ఉంటే చాలే పిల్ల…
నిన్నొదిలి ఉండేదేన్నాళ్ళిలా..
ఊపిరి పొసే నీ ఊసు
శ్వాసగా నాకే అందించు
అయ్యాయో గుండె ఆడేదెల్లా …
మన్నుల్లో నన్నే కలిపేయ్యాలా…
కొంచెం ప్రేమగా లాలించు
పిచ్చిది అయ్యే నా మనసు
ఊరించి మాయం అవ్వకు పిల్లా..
మత్తులో మెల్లగా ముంచితే ఎల్లా..
గుండెలో నిప్పే రగిలించి ప్రాణం కాల్చకు మంటేసి
గొంతులో మాటను దాచేసి మౌనం గుంటావే రాకాసి
ఉప్పెనలోంచే లాగేసివే కాటుక కళ్ళతో వలలేసి
కంటిపాపే ఏడ్చి ఏడ్చి వాలిందంట అలుపొచ్చి
కాదని అవునని విసిగించి ఒంటరి చేసావే వేధించి
నిన్ను నన్ను విడదీసి పోయెను కాలం నవ్వేసి
నేనేమైపోనే చెప్పావే పిల్లా…
మాబుల్లో దాగాకు జాబిల్లిలా..
ఎక్కడకెళ్ళావమ్మయి
అన్ని దిక్కులు నువ్వయి
అయ్యాయో గుండె ఆడేదెల్లా …
మన్నుల్లో నన్నే కలిపేయ్యాలా…
__________________
Song Credits:
సాంగ్: పిల్లా (Pillaa)
చిత్రం: జాబిలమ్మ నీకు అంతకోపమా (Jaabilamma Neeku Antha Kopama)
సింగర్ పేరు: కృష్ణ తేజస్వి (Krishna Tejasvi)
సంగీత దర్శకుడు: G. V. ప్రకాష్ కుమార్ (G. V. Prakash Kumar)
సాహిత్యం: రాంబాబు గోసాల (Rambabu Gosala)
దర్శకుడు: ధనుష్ (Dhanush)
నటీనటులు: పవిష్ (Pavish), అనిఖా సురేంద్రన్ (Anikha Surendra),
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.