Home » పిల్ల సోనీ (Pilla Sony) సాంగ్ లిరిక్స్ | Pooja Nageshwar | Folk

పిల్ల సోనీ (Pilla Sony) సాంగ్ లిరిక్స్ | Pooja Nageshwar | Folk

by Lakshmi Guradasi
0 comments
Pilla Sony song lyrics Pooja Nageshwar

పూల పూలచీర గట్టి పిల్ల సోనీ
నువ్వు పాలవన్నె తీరున్నవే నా దొరసాని
రంగు రంగు అంగిలేసి పిల్లగా నాని
నువ్వు కింగు లాగా వస్తే జారిందోయ్ ఓణీ

జారుతుంటే ఓణీ నేనేమైపోనీ
కోరుతుంది వయసే నీ కొంటె సొగసుని
కోడినాగు ఈడే కోరిందే కానీ
నా సరసకు నువ్వొస్తే ఇక సరిగమ పదని
కలిసి పాడుకుందాం ఇక ప్రేమ కహానీ

పూల పూలచీర గట్టి పిల్ల సోనీ
నువ్వు పాలవన్నె తీరున్నవే నా దొరసాని
రంగు రంగు అంగిలేసి పిల్లగా నాని
నువ్వు కింగు లాగా వస్తే జారిందోయ్ ఓణీ

సోని నా రాణి అందాల నీలవేణి
ఓ కొంటె నవ్వు నవ్వి నువ్వు చెయ్యకే హాని
నాని నాతోని నూరేళ్లు ఉంటానని
మాటిచ్చి అందుకోరా అందాల ఓణీ

ఎంత మొత్తుకున్న నమ్మవేమో గాని
ఎదలోన గీసుకున్నది నిండు బొమ్మని
చాలు చాలు చాలోయ్ నీ ఎత్తులు మాని
పెట్టుపోతలు ఏవి నన్నడగకు గాని
పెట్టుకో మన పెళ్ళిలో బుల్లెట్టు పాటని

పూల పూలచీర గట్టి పిల్ల సోనీ
నువ్వు పాలవన్నె తీరున్నవే నా దొరసాని
రంగు రంగు అంగిలేసి పిల్లగా నాని
నువ్వు కింగు లాగా వస్తే జారిందోయ్ ఓణీ

ఎల్లా నిలువెల్లా పరువాల పొదలుగల్లా
పిల్ల నిన్ను చూస్తే పానమగదే మల్లా
అల్లా నువ్వు అల్లా నన్ను రెచ్చగొడితే ఎల్లా
నా సిత్తమంతా చెదిరి చిత్తు బోతైతుందే

పాల పుంతవే నువ్వు పరువాల పుంతవే
ఒళ్ళు తిప్పి రెక్కించే కళ్ళు ముంతవే
చిలిపి పోరాడ సరసాలు చాలురా
సేరదియారా ఇంకా దూరమేలరా
నా పేరు ముందు నీ ఇంటి పేరు పెట్టారా

పూల పూల పిల్ల పూల పూల
పూల పూలచీర గట్టి పిల్ల సోనీ
నువ్వు పాలవన్నె తీరున్నవే నా దొరసాని
రంగు రంగు అంగిలేసి పిల్లగా నాని
నువ్వు కింగు లాగా వస్తే జారిందోయ్ ఓణీ

పిల్ల రసగుల్లా నువ్వు లేకపోతే ఎల్లా
నిన్ను విడిచి ఒక్క గడియైన ఉండజాలనే
పీలగా ఓ పీలగా నువ్వుంటే నాతో జతగా
రాణి వాసమే ఇంకా గడప దాటనే

ఆట ఆడుకుందామె పాట పాడుకుందామె
లగ్గమాడి లవ్ పాట పాడుకుందామె
ఆడుకుందాము మనము ఆడుకుందాము
లగ్గమాడి లవ్ పాట పాడుకుందాము
నూరేళ్లు ఒకరికొక్కరం మనం గూడి ఉందాము

పూల పూల పిల్ల పూల పూల
పూల పూలచీర గట్టి పిల్ల సోనీ
నువ్వు పాలవన్నె తీరున్నవే నా దొరసాని
రంగు రంగు అంగిలేసి పిల్లగా నాని
నువ్వు కింగు లాగా వస్తే జారిందోయ్ ఓణీ

Song Credits:

సాంగ్ : పిల్ల సోనీ (PILLA SONY)
నటీనటుల: పూజా నాగేశ్వర్ (Pooja Nageshwar) & జాక్సన్ రోహిత్ (Jackson Rohit)
సాహిత్యం: నవీన్ మద్దూరి (Naveen Madduri)
గాయకులు: శివాజీ (Naveen Madduri) & దొండడి పూజ (Dondadi Pooja)
సంగీతం: హనీ గణేష్ (Honey Ganesh)
ఎడిటింగ్: ఆదర్శ్ పటేల్ (Adarsh patel)
కొరియోగ్రాఫర్: లీడింగ్ బాయ్స్ శ్రీకాంత్ (Leading Boys Srikanth)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.