పిలిస్తే పలుకుతానని పిలిస్తే పలుకుతానని
పిలిస్తే పలుకుతానని పలు మార్లు ఇదే మాటని
నువ్వే అన్నావని అంత అంటే విని
ఆశగా ఆర్తిగా ఆశ్రయించాను ఆదుకోమని
సాయి చేదుకోవోయి……. (2)
నమ్మని వారిని సైతం వదలక నడిపిన నీ చేయి
నాకు అందించవా సాయి
నవ్వినా వారికి సైతం వరములు కురిపించావోయి
నా పై అలకేందుకు సాయి
నిన్నదాకా నా కన్నులు మూసినా అహం అలసిపోయి కన్నీట కరిగిపోయి
నిన్ను గాక ఇంకెవరిని వేడను అంటున్నది సాయి పాదాలు కడగనియ్యి
ఏమరుపాటున వున్నావా నా మొర వినలేకున్నావా
నా పొరపాటును మన్నించక నువ్వు లేవేమో అనిపిస్తావా…………
తలొంచే తలపు చాలని, క్షణం లో కరుగుతానని
జయిస్తే మాయ ప్రశ్నని జవాబై దొరుకుతనాన్ని నువ్వే అన్నవని బాబా……..
అంత అంటే విని గుండెలో నిండుగా ఆ అభయ ముద్రనే నింపుకున్నాను
సాయి చేదుకోవోయి…… (2)
నీ చిరునవ్వుల శాంతికి తానే రూపమైనదోయి ఈ దీపాన్ని కాపుకాయి
పరుల కోసమే నిను ప్రార్ధించే నెచ్చెలి చేదోయిపచ్చగ బతక నీయి సాయి
నిత్యం నువ్వు కొలువుండే ఆ మది ఆమెది కాదోయి అది నీ ద్వరకామాయి
నిట్టనిలువునా కొవ్వెలా కూలితే నష్టం నీదోయి
నీకే నిలువ నీడ పోయి
ప్రేమను పంచె ప్రియనేస్తం ప్రేమను పెంచే సుమ శాస్త్రం
ప్రేమను మించిన దైవం లేదను నీ సూక్తికి భాష్యం
చలించని భక్తి ఉందని పరీక్షించేది నేనని
తెలిస్తే చింత లేదని తరించే దారి అదేనని
నువ్వే అన్నవని అంత అంటే విని
ఆలనా పాలనా అని నీవని విన్నవించనీ
సాయి చేదుకోవోయి…….. (2)
In English Version:
Pilisthe palukuthananni, pilisthe palukuthananni
Pilisthe palukuthananni, palumaarlu idhe maatani
Nuvve annaavani antha ante vini
Aashagaa aarthigaa aashrayinchaanu aadukomani
Saayi chedakovoyi… (2)
Nammani vaarini saitham vadhalaka nadipina nee cheyi
Naaku andhinchavaa Saayi
Navvina vaariki saitham varamulu kuripinchaavoyi
Naa pai alakenḍhuku Saayi
Ninnadaakaa naa kannulu moosinaa
Aham alasipoyi kanneeta karigipoyi
Ninnu gaaka inkevarini vedanu
Antunnadhi Saayi, paadaalu kadaganiyyi
Emarupaatuna vunnaavaa
Naa mora vinalekunnaavaa
Naa porapaatunu manninchaka
Nuvvu levemo anipisthaavaa…
Thalonche thalapu chaalani
Kshanamlo karuguthaanani
Jayisthe maaya prashnani
Javaabai dorukuthananni nuvve annavani Baabaa…
Antha ante vini gundelo nindugaa
Aa abhaya mudrane nimpukunnaanu
Saayi chedakovoyi… (2)
Nee chirunavvula shaanthiki
Thaane roopamainadoyi ee deepaanni kaapukaayi
Parula kosame ninu praardhinche
Necchali chedoyi pacchagaa bathaka neeyi Saayi
Nithyam nuvvu koluvunde aa madhi
Aameadhi kaadoyi, adhi nee Dwarakaamaayi
Nittaniluvunaa kovvela koolithe
Nashtam needhoyi
Neeke niluva needa poyi
Premanu panche priyanestham
Premanu penche suma shaastram
Premanu minchina daivam ledanu
Nee sookthiki bhaashyam
Chalinchani bhakthi undhani
Pareekshinchedhi nenani
Thelisthe chintha ledhani
Tharinche daari adhenani
Nuvve annavani antha ante vini
Aalanaa paalanaa ani neevani vinnavinchanee
Saayi chedakovoyi… (2)
________________
Song Credits:
చిత్రం: పిలిస్తే పలుకుతా (Pilisthe Palukutha),
తారాగణం : ఆకాష్ (Akash), షమిత శెట్టి (Shamitha Shetty),
దర్శకత్వం: కోడి రామకృష్ణ (Kodi Ramakrishna),
సంగీతం: ఎంఎం కీరవాణి (MM Keeravani),
సాహిత్యం : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
See Also plz click on this: sai-saranam-baba-saranam-song-lyrics
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.
