Home » పిలిచే పెదవుల పైన (Piliche Pedavula Paina) సాంగ్ లిరిక్స్ – ఖలేజా (Khaleja)

పిలిచే పెదవుల పైన (Piliche Pedavula Paina) సాంగ్ లిరిక్స్ – ఖలేజా (Khaleja)

by Manasa Kundurthi
0 comments
Piliche Pedavula Paina song lyrics Khaleja

మీఠీ మీఠీ ధూన్ ఓ భాజాయే
రాధకే మన్ ఖోలుబాయే
గోపి భోలే గిరిధర్ నందలాలా నందలాలా
మీఠీ మీఠీ ధూన్ ఓ భాజాయే
హే రాధకే మన్ ఖోలుబాయే
ఏ గోపి భోలే గిరిధర్ నందలాలా నందలాలా
గోపి భోలే గిరిధర్ నందలాలా

పిలిచే పెదవుల పైన
నిలిచే మెరుపు నువ్వేనా
పిలిచే పెదవుల పైన
నిలిచే మెరుపు నువ్వేనా

నువ్వు చేరి నడి ఎడారి నందనమై విరిసిందా
తనలో ఆనంద లహరి సందడిగా ఎగసిందా
నడిచిన ప్రతి దారి నదిగా మారి మురిసినదా ముకుందా

కాలం నేను మరచి జ్ఞపకాలో జారిపోయిందా
లోకం గోకులం ల మారిపోయి మాయ జరిగిందా
ఊరంతా ఊగిందా… నీ చంతా చేరిందా గోవిందా

ఈ భావం నాదేనా ఈనాడే తోచేనా
చిరునవ్వోటి పూసింది నా వల్లనా
అది నావెంటే వస్తుంది ఎటు వెళ్లినా
మనసులో ముంచెనా మురిపించేనా మధురమే ఈ లీల

నాలో ఇంతకాలం ఉన్న మౌనం ఆలపించిందా
ఏకాంతాన ప్రాణం బృందగానం ఆలకించిందా
ఊరంతా ఊగిందా… నీ చంతా చేరిందా గోవిందా

జుమో రే జుమో రే జుమో రే ఓ గిరిధర్
జుమో రే జుమో రే జుమో రే ఓ గిరిధర్
జుమో రే జుమో రే జుమో రే ఓ గిరిధర్
జుమో రే జుమో రే జుమో రే
జుమో రే జుమో రే జుమో రే ఓ గిరిధర్
జుమో రే జుమో రే జుమో రే ఓ గిరిధర్
జుమో రే జుమో రే జుమో రే ఓ గిరిధర్
జుమో రే జుమో రే జుమో రే

మరో మురళి భాజావే గిరిధర్ గోపాలా
భాజాకె మనుఖో చురాలే గిరిధ నందలాలా

నా చూపే చెదిరిందా.. నీ వైపే తరిమిందా
చిన్ని క్రిష్నయ్య పాదాల సిరి మువ్వలా
నన్ను నీ మాయ నడిపింది నలు వైపులా

అలజడి పెంచేనా అలరించేనా లాలనను ఈ వేళ
ఏదో ఇంద్రజాలం మంత్రమేసి నన్ను రమ్మందా
ఎదలో వేణు నాదం ఉయ్యాలూపి ఊహ రేపిందా
ఊరంతా ఊగిందా… నీ చంతా చేరిందా గోవిందా

_______________

Song Credits:

సాంగ్ – పిలిచే పెదవుల పైన (Piliche Pedavula Paina)
చిత్రం – ఖలేజా (Khaleja)
గాయకులు – హేమచంద్ర (Hemachandra) & శ్వేతా మోహన్ (Shweta Mohan)
సంగీతం – మణిశర్మ (Manisarma)
లిరిక్స్ – సిరివెన్నెల సీతారామశాస్త్రి (Sirivennela Seetharama Sastry)
నటీనటులు – మహేష్ బాబు (Mahesh Babu), అనుష్క శర్మ (Anushka Sharma)
నిర్మాత – సింగనమల రమేష్ (Singanamala Ramesh)
దర్శకుడు – త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.