సాధారణంగా మహిళలు ఎక్కువగా పెప్లమ్ బ్లౌజ్ వాడరు, దీనికి పలు రకాల కారణాలు చెప్తారు. కానీ కొన్ని టిప్స్ పాటించడం వలన ఈ పెప్లమ్ బ్లౌజ్ లు చాల ఆకర్షణీయంగా కనిపిస్తాయి. పెప్లమ్ టాప్స్ జీన్స్ పైకి బాగా సూట్ అవుతాయి అనుకుంటాం. ఎందుకంటే ఇది ఎత్నిక్ వేర్ గా మీ రుపానికి మోడ్రన్ టచ్ ఇస్తుంది కాబట్టి. అయితే పెప్లమ్ టాప్స్ ను చీరలతో కూడా మ్యాచ్ చేసి ట్రెండీ లుక్ సొంతం చేసుకోవచ్చు.
పార్టీల్లో, ఫంక్షన్లలో అందరి దృష్టిని ఆకర్షించాలంటే, జాకెట్ స్టైల్ పెప్లమ్ బ్లౌజ్ తో చీరను మ్యాచ్ చేస్తే సరిపోతుంది. సాధారణంగా బ్లౌజ్ కి పల్లు కట్టుకుంటారు, కానీ జాకెట్ స్టైల్ పెప్లమ్ బ్లౌజ్ వేసుకుంటే పల్లు లోపలికీ తీసుకుంటారు. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.పెప్లమ్ బ్లౌజ్ తో చీరలో పెర్ఫెక్ట్ లుక్ పొందడానికి కలర్ కాంబినేషన్ పై కూడా ప్రత్యేక శ్రద్ద వహించాలి. కావాలంటే మీరు చీర షేడ్ తో మ్యాచింగ్ కలర్ పేప్లమ్ బ్లౌజ్ ని మీ స్టైల్ లో భాగంగా చేసుకోవచ్చు. ఇది ఎప్పుడు అందంగా కనిపించే లుక్. అంతేకాకుండా డిఫరెంట్ కలర్స్ కూడా ట్రై చేయవచ్చు.
ఇలాంటి మరిన్ని వాటి కొరకుతెలుగు రీడర్స్ ఫ్యాషన్‌ను సందర్శించండి.