Home » పన్నెండు వందలే రాజిరెడ్డి సాంగ్ లిరిక్స్ – Folk

పన్నెండు వందలే రాజిరెడ్డి సాంగ్ లిరిక్స్ – Folk

by Lakshmi Guradasi
0 comment

ఓయ్ రాయిరెడ్డి
పన్నెండు వందలే పన్నెండు వందలే
రాయిరెడ్డి రాయిరెడ్డి

ఆర్… పన్నెండు వందలే రాయిరెడ్డి
నువ్వు పైలంగా తీస్తివే రాయిరెడ్డి
బొంబాయి పోతివే రాయిరెడ్డి
నువ్వు రాజోలుకు వస్తివే రాయిరెడ్డి
కూలికైనా పోత రాయిరెడ్డి
కులాడకుండా వత్త రాయిరెడ్డి
అగ్గిచ్చి బంగిచ్చి రాయిరెడ్డి
బతుకు అంగట్లో పోతివే రాయిరెడ్డి

రాయిరెడ్డి…
పన్నెండు వందలే రాయిరెడ్డి
నువ్వు పైలంగా తీస్తివే రాయిరెడ్డి
బొంబాయి పోతివే రాయిరెడ్డి
నువ్వు రాజోలుకు వస్తివే రాయిరెడ్డి

దుడ్డెన అమ్మిన పైసా రాయిరెడ్డి
నువ్ దుబాయ్ లో పెడితివి రా రాయిరెడ్డి
నీ దుబాయ్ లో దుకాబడవ రాయిరెడ్డి
ధుము దాము చేసేసోస్తివి రా రాయిరెడ్డి
నీ చెత్తకు చెదలు పట్ట రాయిరెడ్డి
నీ చేత చెర్ల బోను రాయిరెడ్డి
ఎడపోయి ఎక్కుతావ్ రాయిరెడ్డి
నువ్వెట్టా పైకొతావ్ రా రాయిరెడ్డి

రాయిరెడ్డి…
పన్నెండు వందలే రాయిరెడ్డి
నువ్వు పైలంగా తీస్తివే రాయిరెడ్డి
బొంబాయి పోతివే రాయిరెడ్డి
నువ్వు రాజోలుకు వస్తివే రాయిరెడ్డి

మేకను అమ్మిన కోత రాయిరెడ్డి
నువ్వు మస్కట్ లో పెడితివి రాయిరెడ్డి
నీ మస్కట్ లో మన్నువడ రాయిరెడ్డి
నీకు మానం పెట్టపాయే రాయిరెడ్డి
నల్ల మొఖం వేసుకుని రాయిరెడ్డి
నువ్వు మల్ల తిరిగోస్తివి రా రాయిరెడ్డి
ఏడ పనిచేత్తవ్ రా రాయిరెడ్డి
నువ్వెట్లా పైకొతావ్ రా రాయిరెడ్డి

రాయిరెడ్డి…
పన్నెండు వందలే రాయిరెడ్డి
నువ్వు పైలంగా తీస్తివే రాయిరెడ్డి
బొంబాయి పోతివే రాయిరెడ్డి
నువ్వు రాజోలుకు వస్తివే రాయిరెడ్డి
(రాయిరెడ్డి రాయిరెడ్డి రాయిరెడ్డి)

హ.. కమ్మలు అమ్మిన రుపాల్ రాయిరెడ్డి
హ.. కత్తర్ లో పెడితివే రా రాయిరెడ్డి
దాని కత్తర్ లో గత్తర్ బడవ రాయిరెడ్డి
అల బిత్తర్ గా చూస్తివే రాయిరెడ్డి
ఓక డబ్బా అణువుగాను రాయిరెడ్డి
నీ అచ్చుడు అగమౌను రాయిరెడ్డి
చెప్పు తినికపోతివి రాయిరెడ్డి
నువ్వు దారికి ఎట్లా వస్తావ్ రా రాయిరెడీ

రాయిరెడ్డి…
పన్నెండు వందలే రాయిరెడ్డి
నువ్వు పైలంగా తీస్తివే రాయిరెడ్డి
బొంబాయి పోతివే రాయిరెడ్డి
నువ్వు రాజోలుకు వస్తివే రాయిరెడ్డి

ఇక ఉన్నాయాన్ని అమ్మి రాయిరెడ్డి
నీకె ఊడ్చి పెడితి గాధ రా రాయిరెడ్డి
ఊళ్ళో ఇజాత్ పోయే రాయిరెడ్డి
ఇక ఉరకుంటే కథ గాదు రాయిరెడ్డి
ఉన్నూరె కన్నతల్లి రాయిరెడ్డి
మనిషి పని చేత్తేనే విలువ రాయిరెడ్డి
కలో గంజి తాగి రాయిరెడ్డి
కలిసి కట్టం చేసుకుందామే రాయిరెడ్డి

కలో గంజి తాగి రాయిరెడ్డి
కలిసి కట్టం చేసుకుందామే రాయిరెడ్డి
కలిసి కట్టం చేసుకుందామే రాయిరెడ్డి
కలిసి కట్టం చేసుకుందామే రాయిరెడ్డి

____________________________

సాహిత్యం – సంగీతం: Sv మల్లిక్‌తేజ (Sv Mallikteja)
గాయకుడు: ప్రభ : (Prabha)
తారాగణం: జానులిరి (Janulyri)
తారాగణం: వల్లారపు శ్రీనివాస్ (Vallarapu Srinivas)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసంతెలుగు రీడర్స్ లిరిక్స్ను చూడండి.

You may also like

Leave a Comment