పడమర లోనే ఎందుకిలా
పొడవర నువ్వే సూర్యుడిలా
మురిసిన ఈ చీకటిలో
భగ భగ వెలుతురులా
విడుదలనే ఊపిరిగా
రగ రగ నువ్ రగల
ఎక్కడికక్కడ దిక్కులనే పిడికిట పట్టర
ఎగిరే జండాలా
పడమర లోనే ఎందుకిలా
పొడవర నువ్వే సూర్యుడిలా
ముళ్ళను రాళ్ళను తొక్కుతు పో
తోవెవడివ్వడు తోసుకు పో
దుఃఖపు దుప్పటి దులిపినవో
చిందును నవ్వుల పూవులివో
అయ్యా బాంచన్ అంటూ మొక్కే
ఎట్టిని మార్చేద్దాం
గుప్పెడు మెతుకుల కోసం ఏడ్చే
సంకెల తెంచేద్దాం
అన్యాయం పై గొంతే ఎత్తితే
మీకది మండేనా
నువ్వే పెట్టిన చట్టమిది పేదలకందేనా
దండం పెట్టక దండోరేస్తాం రో
పడమర లోనే ఎందుకిలా
పొడవర నువ్వే సూర్యుడిలా
పచ్చని పంటల ముచ్చటలో
నెత్తురు చల్లినదెవ్వరురో
బంజరు భూముల గుండెలలో
ఎన్నెల పండుగ ఎన్నడురో
ఎక్కువ జాతి తక్కువ జాతి
ఎక్కడిది నీతి
సొమ్ములు మావి సోకులు మీవి
ఎన్నడు మారేది
ఎక్కితే మదము తొక్కేసే చీమల దండేరో
ఎవ్వడినైనా కూల్చేసే ఎర్రని జండారో
కత్తుల వంతెన పైన కావతేరో
పడమర లోనే ఎందుకిలా
పొడవర నువ్వే సూర్యుడిలా
మురిసిన ఈ చీకటిలో
భగ భగ వెలుతురులా
విడుదలనే ఊపిరిగా
రగ రగ నువ్ రగల
ఎక్కడికక్కడ దిక్కులనే పిడికిట పట్టర
ఎగిరే జండాలా
పడమర లోనే ఎందుకిలా
పొడవర నువ్వే సూర్యుడిలా
______________________________
చిత్రం – విదుదల పార్ట్ 2 (Vidudala Part 2)
పాట – పదమరాలో (Padamaralo)
సంగీత దర్శకుడు: ఇళయరాజా (Ilaiyaraaja)
గాయకులు – V.M. మహాలింగం (V.M. Mahalingam)
సాహిత్యం – కాసర్ల శ్యామ్ (Kasarla Shyam)
తారాగణం: విజయ్ సేతుపతి (Vijay Sethupathi), మంజు వారియర్ (Manju Warrier), సూరి (Soori)
దర్శకుడు: వెట్రి మారన్ (Vetri Maaran)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.