ప్రాణంగా చూసుకుంటాన్నోడే
ప్రాణాలు తిసినాడ
నూరేళ్లు ని బంధమైయినోడే
నీకు యముడు అయ్యేనా
పెద్దలను ఎదురించి
ప్రేమించి పెళ్లి చేసుకోని
అన్నదమ్ములను మరచి
అత్తింట్లో అడుగుపెట్టి
ఎన్నెన్నో ఆశలనే
ఎదలోనే దాచుకుని
ఉరి తాడే ఉయ్యాలయిందా
ఓ చెల్లమ్మా
ఊపిరే ఆగిపోయిందా
నా చెల్లెమ్మా
ఉరి తాడే ఉయ్యాలయిందా
ఓ చెల్లమ్మా
రాఖీ నాకు కట్టెదిఎవరమ్మా
నువ్వు ప్రేమించినందుకు
అమ్మ నాన్నకు కోపమేకాదమ్మా
నా కూతుర్ని ఎట్టా చూసుకుంటాడని
చిన్న భయంమమ్మా
చిన్నారి చెల్లెలు దూరమయ్యే
మా ఇంటి దీపమే ఆరిపొయ్యే
చిన్ననాటి నవ్వులు చెరిగిపొయ్యి
ని అల్లరంతా దురమయ్యే
తాగుబోతు మొగుడు కొట్టిన తిట్టిన
తల వంచి బ్రతికినవమ్మా
అలరుముద్దుగా పెంచుకున్నావమ్మా
అందనంతా దూరం వెళ్లేవా
ఉరి తాడే ఉయ్యాలయిందా
ఓ చెల్లమ్మా
ఊపిరే ఆగిపోయిందా
నా చెల్లెమ్మా
ఉరి తాడే ఉయ్యాలయిందా
ఓ చెల్లమ్మా
ఒక్కసారి కాన రావమ్మా
అందాల నా చెల్లి అలిగందంటే
ఎంత ముద్దుగుండేనో
అడిగింది కావాలనీ ఈ అన్నతో గొడవే పడుతుండెను
నాతోనే చెప్పిన బాగుండునే నీ కాపురం
సక్కదిద్దునే పరాయివాడిని నే కాదులే
నీ కోసం ప్రణాలిచ్చే అన్నానే
అందాల జాబిల్లి నా చెల్లికే రంకు అంటగట్టినాడమ్మా
అవమానాలు తట్టుకోలేక ఆత్మహత్య చూసుకున్నావా
ఉరి తాడే ఉయ్యాలయిందా
ఓ చెల్లమ్మా
ఊపిరే ఆగిపోయిందా
నా చెల్లెమ్మా
ఉరి తాడే ఉయ్యాలయిందా
ఓ చెల్లమ్మా
ఒక్కసారి అన్న అనమ్మ
నా చెల్లెమ్మా అమ్మ చెల్లెమ్మా
________________________________________________
పాట: ఉరి తాడే ఉయ్యాలయిందా నా చెల్లెమ్మా (Ouri Thadu uyyalayindha Naa Chellemma)
సాహిత్యం: అనిత అనిత నాగరాజు ( Anitha Nagaraju)
సంగీతం : కళ్యాణ్ కీస్ (Kalyan keys)
గాయకుడు : జబర్దస్త్ నూకరాజు (Jabardasth Nukaraju)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.