గుండెలోనా సవ్వడుందే
గొంతులోనా ప్రాణముందే
గువ్వలోనా సవ్వడుందే
గొంతులోనా ప్రాణముందే
ఊపిరి మాత్రం ఉన్నపలంగా పోతున్నట్టుందే
ఉక్కిరి బిక్కిరి చేసే భాదే చుట్టుముట్టిందే
ఓరోరి దేవుడో.. ఎన్నెన్ని సిత్తరాలు
సేత్తావు నీ రాతలో
నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము
ఆడాలి ఎన్ని ఆటలో
ఓరోరి దేవుడో.. ఎన్నెన్ని సిత్తరాలు
సేత్తావు నీ రాతలో
నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము
ఆడాలి ఎన్ని ఆటలో
రాయిరప్పల్ని తీసుకొచ్చి
గుళ్ళో దేవత సేత్తావు
రక్తమాంసాలు మాకు పోసి
మట్టిపాలుకమ్మంటావు
అమ్మా ఆలి బంధాలిచ్చి
అంతలోనే తెంచి లోకంలోన
ఏదీ లేదంటు నీ వెంట తీసుకుపోతావు
ఓరోరి దేవుడో.. ఎన్నెన్ని సిత్తరాలు
సేత్తావు నీరాతలో
నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము
ఆడాలి ఎన్ని ఆటలో
ఓరోరి దేవుడో.. ఎన్నెన్ని సిత్తరాలు
సేత్తావు నీరాతలో
నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము
ఆడాలి ఎన్ని ఆటలో
______________________
సాంగ్ : ఒరోరి దేవుడో (Orori Devudo)
చిత్రం: చావు కబురు చల్లగా (Chaavu Kaburu Challaga)
నటీనటులు : కార్తికేయ గుమ్మకొండ (Karthikeya Gummakonda), లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi)
గాయకులు: అనిరుధ్ సుస్వరం (Anirudh Suswaram)
లిరిక్స్ : కరుణాకర్ (Karunakar)
సంగీత దర్శకుడు: జేక్స్ బిజోయ్ (Jakes Bejoy)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.