ఈ భూమి మీద మనకు కొంచెం ప్రశాంతతను ఇచ్చేది ఏమైనా ఉంది అంటే అది సంగీతమే. ఎటువంటి భావాన్ని అయినా సంగీతం తో పలికిస్తే అది ఆ భావాలకు ప్రాణం పోసినట్టు ఉంటుంది. అంతటి గొప్ప మాధుర్యము ఉన్న సంగీతం ఎక్కడి నుంచి పుట్టింది అంటే సప్తస్వరాలు నుంచే అని మనకి అందరికి తెలుసు. స్వప్త స్వరాలూ సంగీతానికి తల్లి లాంటివి. సంగీతానికి మొదలు అయినా సప్త స్వరాల గురించి తెలుసుకుందాం రండి.
స రి గ మ ప ద ని వీటిని మనం సప్త స్వరాలుగా గుర్తిస్తాము. ఈ సప్త స్వరాలూ ప్రకృతి లోని ఒక్కో జంతువు నుండి పుట్టాయి అని మన వేదాలలో చెప్పారు. ఇప్పుడు ఆ స్వరాలూ ఏ ఏ జంతువుల నుండి పుట్టాయో తెలుసుకుందాం రండి.
స స్వరం:
షడ్జమమ్ మయూరో వధతి అంటే నెమలి క్రీంకారం నుండి షడ్జమం అనగా స స్వరం పుట్టింది.
రి స్వరం:
రిషభం గావిస్తూ రిషబు భావనః అంటే ఎద్దు రంకె నుండి రిషభం అనగా రి స్వరం పుట్టింది.
గ స్వరం:
అజా విదంతు గాంధారం అంటే మేక శబ్దం నుంచి గాంధారం అనగా గ స్వరం పుట్టింది.
మ స్వరం:
క్రౌంచ క్వణతి మాధ్యమం అంటే క్రౌంచ పక్షి పలుకుల నుంచి మాధ్యమం అనగా మ స్వరం పుట్టింది.
ప స్వరం:
పుష్ప సదరన్ కాలే బిగః కుజహీహ్ పంచమం అంటే కోయిల కూత నుంచి పంచమం అనగా ప స్వరం పుట్టింది.
ద స్వరం:
దైవతం హేశాతం వాజి అంటే గుర్రపు ధ్వని నుంచి దైవతం అనగా ద స్వరం పుట్టింది.
ని స్వరం:
నిషాధం బ్రహ్మదే గజహః అంటే ఏనుగు గీంకారం నుంచి నిషాధం అనగా ని స్వరం పుట్టింది.
ఈ సప్త స్వరాలలో స, ప ను ప్రకృతి స్వరాలూ గ పిలుస్తారు. అంటే సంగీతం లో స, ప ఒక్కటే ఉన్తయి వాటిలో ఎటువంటి బేధాలు కానీ రకాలు కానీ ఉండవు.
ఇక మిగిలిన స్వరాలూ అయినా రి, గ, మా, ద, ని, వీటిని వికృతి స్వరాలూ అంటారు అంటే వీఏటిలో బేధాలు ఉంటయి. అంటే మనం రి స్వరం ను గమనిస్తే దాంట్లో ‘ర’, ‘రి’, ‘రు’ ఇలా తోటి స్వరాలూ కూడా వస్తాయి.
మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ కల్చర్ ను సందర్శించండి.