Home » ఊహాలోన ఊసులాడే (Oohalona Oosulaade) సాంగ్ లిరిక్స్ | Kaalamega Karigindhi

ఊహాలోన ఊసులాడే (Oohalona Oosulaade) సాంగ్ లిరిక్స్ | Kaalamega Karigindhi

by Lakshmi Guradasi
0 comments
Oohalona Oosulaade song lyrics Kaalamega Karigindhi

Oohalona Oosulaade song lyrics Kaalamega Karigindhi:

ఉలుకుల పలుకులు తెలిచిన చిలకా..

ఉలుకుల పలుకులు తెలిచిన చిలకా
ఉరుములు తేల్చిన గొడవలు తెలుసా?
హృదయపు తలుపులు తెరిచిన మగువ
తలపున మునిగిన హృదయము తెలుసా?

పూల వాననా? వాలుతుంది మీన
రాగ మేళమా? కూయమంది కూన..
వాయు వేగమా? తరుముతుంది లోన ఈ వేళలో..

గాలి వానలే రాలుతున్న బాట
నీలి వెన్నెలే తాకుతున్న పూట..
వాలు కన్నులే లాగుతున్న చోట
ఉండాలనే నా ధ్యాస
telugureaders.com

ఊహాలోన ఊసులాడే ఉజ్వలాంగీ ఉయ్యాలలూగుదామా?
కాలమాపి కదులుతున్న కోమలాంగీ కలైపోవుగా?
గాలిలోన తూలుతున్న మేఘమాల గమ్యాన్ని చేరనివ్వు
గుండెలోన దాగివున్న చిత్రమాల గుచ్చుకోకలా

వయ్యారి పారిపోకు చూసి చలించిపోన అడుగు స్పర్శ తాకినా?
సింగారి చూసిపోవోసారి తరించిపోన నిన్ను ఏడ చూసినా
దాగేనా దారిలో? సాగేనా తోడుగా అలా?
తాకేనా నేరుగా? నువ్వు చుసినా చాటుగా దాగానా

ఊహాలోన ఊసులాడే ఉజ్వలాంగీ ఉయ్యాలలూగుదామా?
కాలమాపి కదులుతున్న కోమలాంగీ కలైపోవుగా?
గాలిలోన తూలుతున్న మేఘమాల గమ్యాన్ని చేరనివ్వు
గుండెలోన దాగివున్న చిత్రమాల గుచ్చుకోకలా

ఎందుకో ఇంత వాదన? ఏకంగ తోసుంది కొత్త మాయలో
ఏమిటో అంత లోతున? వేగంగా తాకింది వింత చోటులో
ఆగేనా నా రథి? మారేనా నా వీథి? తిథి?
తేలేనా నా గతి? చేరనా ఆగినా మది చెంతనా?

ఊహాలోన ఊసులాడే ఉజ్వలాంగీ ఉయ్యాలలూగుదామా?
కాలమాపి కదులుతున్న కోమలాంగీ కలైపోవుగా?
గాలిలోన తూలుతున్న మేఘమాల గమ్యాన్ని చేరనివ్వు
గుండెలోన దాగివున్న చిత్రమాల గుచ్చుకోకలా..
Note: మీరు చదువుతున్నది telugureaders.com పబ్లిష్ చేసిన లిరిక్స్.

Song Credits:

CategoryDetails
Song Nameఊహాలోన ఊసులాడే (Oohalona Oosulaade)
Movie Nameకాలమేగ కరిగింది (Kaalamega Karigindhi)
Singersసాయి మాధవ్ (Sai Madhav), ఐశ్వర్య దరూరి (Aishwarya Daruri)
Lyricsసింగర మోహన్ (Singara Mohan)
Music Directorగూడప్పన్ (Gudappan)
Castవినయ్ కుమార్ (Vinay Kumar), శ్రావణి మజ్జారి (Shravani Majjari)
Writer & Directorసింగర మోహన్ (Singara Mohan)
Producerమారే శివశంకర్ (Mare Siva Shankar)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.