ఒకటే జననం (Okate Jananam) సాంగ్ లిరిక్స్, భద్రాచలం (Bhadrachalam)

by Lakshmi Guradasi

అవుట్ అఫ్ ది డార్క్నెస్ కేం ది లైట్
అల్ లైట్స్ బిగిన్ ఇన్ ది డార్క్నెస్
వీ అర్ అల్ మూవింగ్ టువార్డ్స్ ది లైట్
కం స్టెప్ విత్ మీ ఆన్ థిస్ జర్నీ అఫ్ ఏ లైఫ్టైమ్

ఒకటే జననం ఒకటే మరణం
ఒకటే గమనం ఒకటే గమ్యం
గెలుపు పొందే వరకు
అలుపు లేదు మనకు
బ్రతుకు అంటే గెలుపు
గెలుపు కొరకే బ్రతుకు

కష్ఠాలు రానీ కన్నీళ్లు రానీ
ఏమైనా కానీ ఎదురీది రానీ
వోడి పోవద్దు రాజి పడొద్దు
నిద్రే నీకొద్దు నింగే నీ హద్దు

ఒకటే జననం ఒకటే మరణం
ఒకటే గమనం ఒకటే గమ్యం
గెలుపు పొందే వరకు
అలుపు లేదు మనకు
బ్రతుకు అంటే గెలుపు
గెలుపు కొరకే బ్రతుకు

రాబోయే విజయాన్ని
పిడికిలిలో చూడాలి
ఆ గెలుపు చప్పట్లే
గుండెలలో మోగాలి

నీ నుదుటి రేఖలపై
సంతకమే చేస్తున్న
ఎద నిండా చిరునవ్వే
చిరునామై ఉంటున్న

నిన్నే వీడని నీడ వాలే
నీతో ఉంటా ఓ నేస్తం
నమ్మకమే మనకున్న బలం

నీలి కళ్ళల్లో మెరుపు మెరవాలి
కారు చీకట్లో దారి వెతకాలి
గాలి వానల్లో ఉరుమై సాగాలి
తగిలే గాయల్లో ధ్యేయం చూడాలి

ఒకటే జననం ఒకటే మరణం
ఒకటే గమనం ఒకటే గమ్యం
గెలుపు పొందే వరకు
అలుపు లేదు మనకు
బ్రతుకు అంటే గెలుపు
గెలుపు కొరకే బ్రతుకు

నిద్దరోతా నిలుచుంటా
వెన్నెలలో చెట్టువలె
నీకోసం వేచుంటా
కన్నీటి బొట్టువలె

అడుగడుగు నీ గుండె
గడియారం నేనవుతా
నువ్వు నడిచే దారులలో
ఎదురొచ్చి శుభమవుతా

రాసిగా పోసిన కలలన్ని
దోసిలి నిండా నింపిస్త
చేతులు చాచిన స్నేహంలా

ముట్టుకున్నావా మువ్వా అవుతుంది
పట్టుకున్నావా పాటే అవుతుంది
అల్లుకున్నావా జల్లే అవుతుంది
హత్తుకున్నావా వెల్లువవుతుంది

ఒకటే జననం ఒకటే మరణం
ఒకటే గమనం ఒకటే గమ్యం

గెలుపు పొందే వరకు
అలుపు లేదు మనకు
బ్రతుకు అంటే గెలుపు
గెలుపు కొరకే బ్రతుకు

In English Version:

Out of the darkness came the light
All lights begin in the darkness
We are all moving towards the light
Come step with me on this journey of a lifetime

Okate jananam okate maranam
Okate gamanam okate gamyam
Gelupu ponde varaku
Alupu leedu manaku
Bratuku ante gelupu
Gelupu korake bratuku

Kashtaalu raani, kannillu raani
Emaina kaani edureedi raani
Odi povaddu, raaji padoddu
Nidre neekoddu, ninge nee haddu

Okate jananam okate maranam
Okate gamanam okate gamyam
Gelupu ponde varaku
Alupu leedu manaku
Bratuku ante gelupu
Gelupu korake bratuku

Raaboye vijayaani
Pidikililo choodaali
Aa gelupu chappatle
Gundelalo mogaali

Nee nuduti rekhalapai
Santakame chestunna
Eda nindaa chirunavve
Chirunaamai untunna

Ninne veedani needa vaale
Neetho untaa, O nestam
Nammakame manakunna balam

Neeli kallallo merupu meravaali
Kaaru cheekatlo daari vetakaali
Gaali vaanallo urumai saagaali
Tagile gaayallo dhyeyam choodaali

Okate jananam okate maranam
Okate gamanam okate gamyam
Gelupu ponde varaku
Alupu leedu manaku
Bratuku ante gelupu
Gelupu korake bratuku

Niddarota niluchuntaa
Vennelalo chettuvale
Neekosam vechuntaa
Kanniti bottuvale

Adugadugu nee gunde
Gadiyaaram nenavuttaa
Nuvvu nadiche daarulalo
Eduruchchi shubhamavuta

Raasiga posina kalalanni
Dhosili nindaa nimpista
Chetulu chaachina snehambla

Muttukunnavaa muvvva avutundi
Pattukunnavaa paate avutundi
Allukunnavaa jalle avutundi
Hattukunnavaa velluvavutundi

Okate jananam okate maranam
Okate gamanam okate gamyam

Gelupu ponde varaku
Alupu leedu manaku
Bratuku ante gelupu
Gelupu korake bratuku

_______________

Song Credits:

పాట: ఒకటే జననం (Okate Jananam)
చిత్రం: భద్రాచలం (Bhadrachalam)
తారాగణం: సింధు మీనన్ (Sindhu Menon), శ్రీహరి (Srihari)
సంగీత దర్శకుడు: వందేమాతరం శ్రీనివాస్ (Vandemataram Srinivas)
లిరిసిస్ట్: సుద్దాల అశోక్ తేజ (Suddala Ashok Teja)
గాయకులు: K.S. చిత్ర (K.S. Chitra), శంకర్ మహదేవన్ (Shankar Mahadevan)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like