సాగుతూ ఉన్న పయనానికి మూలమే కాలం
జారుతున్న వెలుతురికి నీవే గమ్యం
నిన్ను చివరి వరకు మోసే నేల నీదేగా
వీళ్ళు కొలుచు సాములపై నీకు హక్కు ఉంది రా
నీ కన్నీళ్లన్నీ…..
నీ కన్నీళ్లన్నీ బాణాలై నింగిని చీల్చాలిరా
ఇక గెలుపుతోనే కాలం పురుడు పోయాలి రా
ఓ రాయా……ఓ రాయా……
ఓ రాయా……ఓ రాయా……
ఓ… ఓ… కోయిలమ్మ జోల పాట పాడేవా
ఓ….వెన్నెలమ్మ నిద్దుర తెచ్చి కప్పేవా
అడుగులు వేయకముందే పరుగులు తీసే
కమ్ము కొచ్చే చీకటి మీద దండయాత్ర చేసేయ్
కాచే కలలు అన్నీ రగిలే గుప్పిట పట్టేయ్
లోకం కొమ్ములు వంచాయ్
ధీరా.. ధీర
ఒంటిగా ముందుకు సాగేయ్
వీరం తోడుగా రాదా స్వేదం ఆయుధమేర
ధీరా.. ధీర
సాన పట్టు సంకల్పం ఎక్కు పెట్టు నీ ధ్యేయం
పట్టుదలే పల్లకిలే రాయా….
సాన పట్టు సంకల్పం ఎక్కు పెట్టు నీ ధ్యేయం
పట్టుదలే పల్లకిలే రాయా….
ఓ రాయా……ఓ రాయా……
ఓ రాయా……ఓ రాయా……
ఓ రాయా……ఓ రాయా……
ఓ రాయా……ఓ రాయా……
______________________
సాంగ్ : ఓ రాయా (Oh Raaya)
సినిమా : రాయన్ (Raayan)
సంగీతం: ఏ ఆర్ రెహమాన్ (A R Rahman)
లిరిక్స్ : కల్ప్రద (Kalpradah)
గాయకులు: గానవ్య దొరైస్వామి (Ganavya doraiswamy)
నటులు : ధనుష్ (Dhanush), SJ సూర్య (SJ Suryah), సందీప్ కిషన్ (Sundeep Kishan)
రచన, దర్శకత్వం: ధనుష్ (Dhanush)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.