సూటిగా చెప్పలేను
చాటుగా దాచలేను
తీరని ప్రేమ నేను
నిన్నేల చేరుకోను
ఎందుకు కొచ్చావో నువ్వు నాలోకి
వేల రంగులోన వెలిగానే
ఊపిరిచవే గుండెలోగిలికి
వెండి మబ్బుల్లోన తిరిగానే
నిమిషమైనా నిను వదిలి
నిలువలేని మనసు ఇది
తననుతానే మరచినది….
రెండుగ చిలనీ ఆకాశం
ముక్కలై పేలని భూగోళం
ఎన్నడు నేనిలా నీకోసం ఉండనా..
ఓ పిల్లా నువ్వంటే ఇష్టమే
ఓ పిల్లా నువ్వంటే ప్రాణమే
ఓ పిల్లా నా గుండెలోతుల్లో
చేరగని కల నువ్వే
ఓ పిల్లా నా వంక చూడవే
ఓ పిల్లా నా జంటై చేరవే
ఓ పిల్లా నా బుజ్జి గుండెను నవ్వించావే
రెప్ప లేని కంటి పాపై
చెలియ నిను చూస్తున్నా
అంతు లేని నీ మౌనమే
నిలువునా కాల్చినా
నింగి తీరాన చందమామ నువ్వు
నేల దారుల్లో గట్టి పువ్వు నేను
అయ్యో ధూరం చాలనే
నీతో నేను సరిపోనే
అయినా నిను ప్రేమించానే
కూరిసే నీ సిరి వెన్నెలనడిగానే
పువ్వుల కోరుకున్నా
ముల్లులా గుచ్చుకోకే
ప్రేమగా వేడుకున్నా
కాదని వెళ్లిపోకే
అఆ ఆఆ..
చుట్టు చీకటి ఉందే
ఏమి తోచకుంది
చెంత నువ్వు లేని లోటుగా
మనుసు అగనంది
మార్గం ఏమిటంది
మరల నిన్ను చేరగా
కన్నుల ముందే ఉన్న నిన్ను
చూసి చూడనే లేదుగా
కన్న నిన్ను వదులుకున్న
నేరమంతా నదేగా…
ఓప్రేమ నువ్వంటే ఇష్టమే
ఓ ప్రేమ నువ్వంటే ప్రాణమే
ఓ ప్రేమ నువ్వెంటో తెలియక
పొరపాటైనదే..
ఓ ప్రేమ నా బాధ చూడవే
ఓ ప్రేమ నా జత చేరవే
ఓ ప్రేమ నా పిచ్చి ప్రేమను మన్నించావే
ఓ ప్రేమా!
__________________
లిరిక్స్ : సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి (Saraswati Puthra Ramajogayya Sastry)
గానం : హరిచరణ్ (Haricharan) మరియు హరిణి ఇవటూరి (Harini Ivaturi)
సంగీతం: ది ఫాంటాసియా మెన్ (The Fantasia Men)
నటీనటులు: బన్నీవాక్స్ (Bunnyvox), వరుణ్ బాబు (Varun Babu)
కథ: ఎస్ కృష్ణ (S Krishna)
దర్శకత్వం: సునీల్ రెడ్డి (Suneel Reddy)
నిర్మాతలు: బన్నీవాక్స్ (Bunnyvox), ఎస్ కృష్ణ (S Krishna)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.