Home » ఓ సాథియా (O Saathiya) సాంగ్ లిరిక్స్ – లవ్ రెడ్డి (Love Reddy)

ఓ సాథియా (O Saathiya) సాంగ్ లిరిక్స్ – లవ్ రెడ్డి (Love Reddy)

by Lakshmi Guradasi
0 comments

ఓ సాథియా సాథియా
నిన్ను చూడగా దిల్ దియా
ఓ సాథియా సాథియా
నా నిద్దరే చల్ గయా

నీ పేరులో తీపిని తీసా
నా పెదవులకతికించేసా
ప్రతి మాట తీపవ్వాలని ఆశ
నీ ఊహలు రెక్కలు చేసా
నా మనసుకు తొడిగించేసా
తొలి ప్రేమాకాశం లో ఎగిరేశా

ఎన్నో ఎన్నో చెప్పాలని
కన్నానులే కల
నిజం నిజం చెయ్యాలని
వచ్చానులే ఇలా..

ఊరికే ఊరిస్తుంటావే
ఊపిరే తీసేస్తుంటావే
ఇంకెంతకాలం నన్నీలా
ఉడికిస్తుంటావే వెన్నెల
ఇంకెన్నేనేళ్లు నేనిలా
నీ వెనకాలే తిరగాలో చెప్పు నీడలా

కాసింత కరుణే లేదా
కూసంత పంతం పోదా
నా బాధ అర్ధం కానే కదా
ఓ సారి ఊ అనలేవా
అందంగా అల్లుకుపోవా
చిరునవ్వుని కొంచెం విదిలిస్తావా

ఎన్నో ఎన్నో చెప్పాలని
కన్నానులే కల
నిజం నిజం చెయ్యాలని
వచ్చానులే ఇలా..

ప్రాణం ముందుకు తోస్తుంటే
మౌనం వెన్నక్కి లాగ్గిందే
అరె ఎవరున్నారో
నా కళ్ళలోన చూసుకో
ఆ చూసే చూపే మైమరిపిస్తుందా

ఏ బొమ్మేసానో గుండెలో
తెలియాలంటే నువ్వొచ్చి
నాలో నిండిపో..

ఎన్నో ఎన్నో చెప్పాలని
కన్నానులే కల
నిజం నిజం చెయ్యాలని
వచ్చానులే ఇలా..

_____________________________

పాట – ఓ సాథియా (O Saathiya)
చిత్రం: లవ్ రెడ్డి (Love Reddy)
సంగీతం: ప్రిన్స్ హెన్రీ (Prince Henry)
గాయకులు – హరి చరణ్ (Hari Charan) & లిప్సిక (lipsika)
తారాగణం – అంజన్ రామచేంద్ర (Anjan Ramachendra ), శ్రావణి కృష్ణవేణి (Shravani Krishnaveni)
రచయిత & దర్శకుడు: స్మరణ్ రెడ్డి (Smaran Reddy)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment