అందమైన ఆడపిల్లని…
చందమామకంటే తెల్లగుంటిని
హ కలలు కన్నె పిల్లని
నీ మీద మనసు పారబోస్తిని
నీ ఏంట తిరుగుతున్న తిరిగి చూడవేందయ్యా
నీ కంట పడినగాని పలకరించవేమయ్యా
రంది పడితి నేనయ్యా…
ఓ.. రామయ్య వగలమారి రామయ్య
ఓ.. రామయ్య వయ్యారి దాన్ని నేనయ్యా
ఓ.. రామయ్య వగలమారి రామయ్య
ఓ.. రామయ్య వయ్యారి దాన్ని నేనయ్యా
మనసులోన ప్రేమ పొంగుతున్నది
మనువాడ ప్రాణమంతా గుంజుతున్నది
నిన్ను చూడకుండా ఉండనన్నది
నీ తోడు కోరుకున్నది ఈ చిన్నది
నా వయసు వరుస కలిపే
నా సొగసు నిన్నే తలిచే
కనులేమో కలవరించే
కడదాకా నీతో బతుకే
రెక్కల్లా గుర్రమెక్కినట్టు ఉంది మావయ్యా
గుండెల్లా గుప్పేడంత బాధ తీర్చవేమయ్యా
బంగారు మావయ్యా…
ఓ.. రామయ్య వగలమారి రామయ్య
ఓ.. రామయ్య వయ్యారి దాన్ని నేనయ్యా
ఓ.. రామయ్య వగలమారి రామయ్య
ఓ.. రామయ్య వయ్యారి దాన్ని నేనయ్యా
ఎదురు చూస్తూ ఎదల దాచుకుంటిని
ఒకచోట కుదురుగుండలేకపోతిని
జ్ఞాపకాలు ఒడిలో ఊగిపోతిని
మన జాతకాలు కలిసి ఆగకుంటిని
పెళ్లి పీటలెక్కి నా కాలి మెట్టె తొడిగి
నా కొంగు ముడిని వేసి ఎడడుగులను నడిచి
చావైనా బతుకైనా నీతోనని మొత్తుకుంటిని
ఊహల్లో తలుచుకుంటూ నిన్ను హత్తుకుంటిని
మేనత్త బిడ్డని…
ఓ.. రామయ్య వగలమారి రామయ్య
ఓ.. రామయ్య వయ్యారి దాన్ని నేనయ్యా
ఓ.. రామయ్య వగలమారి రామయ్య
ఓ.. రామయ్య వయ్యారి దాన్ని నేనయ్యా
ఈడు జోడు మనది మస్తుగుంటది
ఇద్దరము ఒక్కటైతే జిందగుంటది
మాయ చేసి నన్ను మలుపుకుంటివి
నా మేడలా తాళిబొట్టు కట్టుమంటిని
నీవంటి నాకు ఇష్టం
చచ్చేంత పంచ ప్రాణం
ఇస్తాను ఎదురు కట్నం
ఉందాములే కలకాలం
నేనేరి కోరుకున్నా నా మొగునివైతివో
నీ ఇంటి గడప తొక్కి నీ అలినైతరో
కలిసుంటా మావయ్యా…
ఓ.. రామయ్య వగలమారి రామయ్య
ఓ.. రామయ్య ఒక్కసారి చూడవేందయ్యా
ఓ.. రామయ్య వగలమారి రామయ్య
ఓ.. రామయ్య ఒక్కసారి చూడవేందయ్యా
Song Credits:
నటి : లాస్య స్మైలీ (LASYA SMILY)
సాహిత్యం: కపిల్ మద్దోరి (KAPIL MADDORI)
గాయకుడు: వాగ్దేవి (VAGDEVI)
సంగీతం: కళ్యాణ్ కీస్ (KALYAN KEYS)
దర్శకుడు: రవీంద్ర పూరి (RAWINDRA PURI)
నిర్మాతలు: ప్రవీణ (PRAVEENA) & అనిల్ కడియాల (ANIL KADIYALA)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.