Home » ఓ నవ్వు చాలు (O Navvu Chalu) సాంగ్ లిరిక్స్ – నువ్వు నాకు నచ్చావ్ 

ఓ నవ్వు చాలు (O Navvu Chalu) సాంగ్ లిరిక్స్ – నువ్వు నాకు నచ్చావ్ 

by Lakshmi Guradasi
0 comments
O Navvu Chalu song lyrics Nuvvu Naaku Nachav

నా చెలియ పాదాలు హంసలకే పాఠాలు
తాను పలికితే చాలు తేనె జలపాతాలు

ఓ నవ్వు చాలు ఎన్నెన్నో వలలు వేస్తూ అల్లుకుంటుంది
ముత్యాల జల్లు మృదువైన ముళ్ళు మదిలో గుచ్చుకుంటుంది
ఆ సోగ కళ్ళ ఓ సైగ చాలు మనసే ఆగనంటుంది
చెక్కిళ్ళలోని నొక్కుల్లో చేరి మళ్ళీ తిరిగి రానంది
పట్టపగలెవరైనా రాతిరిని చూస్తారా తన కురులు చూపిస్తా ఔననక చస్తారా
ఓ నవ్వు చాలు ఎన్నెన్నో వలలు వేస్తూ అల్లుకుంటుంది
ముత్యాల జల్లు మృదువైన ముళ్ళు మదిలో గుచ్చుకుంటుంది

గుండెల్లో భోగిమంటలా ఎండల్లో లేత వెన్నెల
కొండల్లో ఏటిపరుగులా ఊపుతున్న లయలో
గుమ్మంలో సంధ్యవెలుగులా కొమ్మల్లో కొత్త చిగురులా
మబ్బుల్లో వెండిమెరుపులా ఆమెకెన్ని హొయలో
అలా నడిచి వస్తుంటే పువ్వులవనం శిలై పోని మనిషుంటే మనిషే అనం
ఓ నవ్వు చాలు ఎన్నెన్నో వలలు వేస్తూ అల్లుకుంటుంది
ముత్యాల జల్లు మృదువైన ముళ్ళు మదిలో గుచ్చుకుంటుంది

గాలుల్లో ఆమె పరిమళం ఊపిరిలో నిండి ప్రతి క్షణం
ఎటు ఉన్నా నన్ను వదలదే ఎలా తప్పుకోను
గుర్తొస్తే ఆమె పరిచయం కవ్వించే పడుచు పసిదనం
రెప్పల్లో కైపు కలవరం ఎలా దాచుకోను
కలో కాదో నాకే నిజం తేలక ఎలా చెప్పడం తాను నాకెవ్వరో
అదిరిపడకయ్యా ఇది ఆమె మాయ ఇది కవిత కాదబ్బా మన్మధుడి దెబ్బ

ఓ నవ్వు చాలు ఎన్నెన్నో వలలు వేస్తూ అల్లుకుంటుంది
ముత్యాల జల్లు మృదువైన ముళ్ళు మదిలో గుచ్చుకుంటుంది
ఆ సోగ కళ్ళ ఓ సైగ చాలు మనసే ఆగనంటుంది
చెక్కిళ్ళలోని నొక్కుల్లో చేరి మళ్ళీ తిరిగి రానంది
పట్టపగలెవరైనా రాతిరిని చూస్తారా తన కురులు చూపిస్తా ఔననక చస్తారా

_______________________

పాట: ఓ నవ్వు చాలు (O Navvu Chalu)
ఆల్బమ్: నువ్వు నాకు నచ్చావ్ (Nuvvu Naaku Nachav)
నటీనటులు: వెంకటేష్ (Venkatesh), ఆర్తి అగర్వాల్ (Arthi agarwal)
సంగీతం : కోటి (Koti)
సాహిత్యం – సిరివెన్నెల (Sirivennela)
గాయకులు: శంకర్ మహదేవన్ (Shankar Mahadevan)
దర్శకుడు: కె. రాఘవేంద్రరావు (K. Raghavendra Rao)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.