నా పాదాలకెట్టిన పారాణి చెప్పమ్మా
కన్నీళ్లతో కాళ్ళకు అద్దుకున్ననని
నా సెయ్యి పట్టుకున్న చేతుల్లో లేదమ్మా
చెప్పలేక చెంపదిద్దుకున్ననని
నేను మానసిచ్చినానమ్మ
మాంగల్యమా అది మదిలోనే దాచెను మనించవే
నీ మనసు మన్నుగానే ఎన్నెలమ్మా
నిన్ను మరువలేక పోతున్నానమ్మా
నువ్వు పట్టు చీరతోని పందిట్లోకత్తుంటే
పాణలే నన్నిడిసిపోతున్నాయే
ఓ అవని నా అవ్వ తోడే
నన్ను కన్నీటి కాటిలో కాలేసి పోతున్నవే
తల్లి ధరణి నీ కొంగు దాచుకొని
యమునికెదురుంగా వెళ్ళిపోవే
ఓ అవని నా అవ్వ తోడే
నన్ను కన్నీటి కాటిలో కాలేసి పోతున్నవే
తల్లి ధరణి నీ కొంగు దాచుకొని
యముని ఎదురుంగా వెళ్ళిపోవే
కళ్ళకి కాటుక పెడుతున్నానే
కన్నీలే కరువైపోయినాయి కంటికి
ఏలువట్ట ఏడికి పోతున్నవే
ఏలుకొని వెంటొస్తవనుకున్నానే ఇంటికి
కాళ్ళు మొక్కిన కరగలేదే
కన్న పేగు కట్టేసినాదే
దుఃఖమంతా దిగమింగుకొని
దూరమైపోతున్న నేనే
ఏ శ్రీమంతుడొచ్చేనమ్మా
నీ మనసు ఎన్ని బోసి కొన్నారే
కంటి రేప్పొలే కాసుకున్న
నీ కన్నీళ్లే తోడయానే
నిన్ను పొందలేక నేను నిందల పాలైన
పందిట్లో కూసున్న బందీలా ఈ రోజున
తల్లి ధరణి నీ కొంగు దాచుకొని
యముని ఎదురుంగా వెళ్ళిపోవే
ఓ అవని నా అవ్వ తోడే
నన్ను కన్నీటి కాటిలో కాలేసి పోతున్నవే
తల్లి ధరణి నీ కొంగు దాచుకొని
యముని ఎదురుంగా వెళ్ళిపోవే
ఎట్లా రాసుకున్నానే రాత
నీ తోడు నోచుకోకపోతిని
అవని యాదికొస్తలేననే అంత దూరమై నే పోతిన
పసుపు తాడు పరువనుకొని
తోలుతున్న మరువనుకొని
మరిసి ఎట్లా మనసులో వాడ్ని ఏలుకోని కన్నీళ్లతోని
నీ మానాది మన్నుగానే మరువ సావన్న వస్తలేదే
మానసిచ్చిపోతివమ్మ మాను ఉండంగా వచ్చి పోవే
నీ పెళ్లి పందిట్లోన కన్నీళ్లతో
నా బతుకు చెల్లిపోయే రాలేను మన్నించవే..
ఓ అవని నా అవ్వ తోడే
నన్ను కన్నీటి వరదలో ముంచెల్లిపోతున్నవే
తల్లి ధరణి నీ ఒడిలో దాచుకోవే
యముడే రమ్మని పిలుపాయనే
ఓ అవని నా అవ్వ తోడే
నన్ను కన్నీటి వరదలో ముంచెల్లిపోతున్నవే
తల్లి ధరణి నీ ఒడిలో దాచుకోవే
యముడే రమ్మని పిలుపాయనే
_______________________
సాహిత్యం & దర్శకత్వం: పోతరాజు శ్రీకాంత్
సంగీతం : ఇంద్రజిత్
గాయకులు: హన్మంత్ యాదవ్, దివ్య మాలిక
నటీనటులు: నీతు క్వీన్, నరేష్ జయరాపు , ముద్దూరి కొమరయ్య, తిరుమల, పవన్
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.