ఆనాడే నువ్వు చెప్పివుంటే
ముడులెందుకు వేసొటుడినే పిల్ల
ఆనాడే నువ్వు అలిగివుంటే
నీ పెళ్లి చేసేటోడ్నే
ఆనాడే నువ్వు చెప్పివుంటే
ముదులెందుకు వేసొటుడినే పిల్ల
ఆనాడే నువ్వు అలిగివుంటే
నీ పెళ్లి చేసేటోడ్నే
పెళ్లి పెళ్ళామంటే మనస్సును
తూటాలను గట్టిన పిల్లోడినే
నగలు పట్టు చీరలు ఎన్నడూ
కొన్ని దాచుకున్న పిచ్చోడినే
చిన్ననాటి ప్రేమ నీకుందని
పానమంతా వాడిమీద ఉందని
చెప్పివుంటే బాగుండేదే పిల్ల
నా చెంప చెమ్మతో తడిచేది గాదె
న్యాయమేన చెలి
ప్రాణంగా ప్రేమిస్తే పిచోడ్ని చేసుడు
న్యాయమేన చెలి
బంగారమనుకుంటే నన్ను బాధపెట్టుడు
న్యాయమేన చెలి
చినుకు నువ్వనుకుంటే మంటల్లోకి నెట్టుడు
న్యాయమేన చెలి
మాణిక్యమనుకుంటే నన్ను మోసగించుడు
గారాల పెళ్ళామని నిన్ను
నోరారా పిలవమని గాజులు నీకిస్తినే
బంగారు తాళి నీకు కడితినే
గాయమైందే నా గుండెకు
గాజు ముక్కలు గుచ్చి చిన్నదానా
ఆగుతుందే నా ప్రాణము
పుస్తితాడుతో మెలివేస్తే పిచ్చిదానా
కాలు పెట్టుకోవాలా చెప్పే
కళ్ళు మూసుకొవాల చెప్పే
కోరి కోరి చేసుకున్న కొట్టి చెప్పలేనే
బతుకు నికొస్తే నేప్పే
బల్లు బల్లుమంటూ ఏడ్వాల చెప్పే
గొంతుకోసుకోవాల చెప్పే
గుండె మీద గీసుకున్న పేరు
మరిచిన ప్రేమకు ప్రేమకు నిప్పే
న్యాయమేన చెలి
ప్రాణంగా ప్రేమిస్తే పిచోడ్ని చేసుడు
న్యాయమేన చెలి
బంగారమనుకుంటే నన్ను బాధపెట్టుడు
న్యాయమేన చెలి
చినుకు నువ్వనుకుంటే మంటల్లోకి నెట్టుడు
న్యాయమేన చెలి
మాణిక్యమనుకుంటే నన్ను మోసగించుడు
సచ్చెదాక ప్రేమిస్తానే
బతుకంతా నిన్ను నేను పూజిస్తానే
మరిచి రావే నీ ప్రేమనే
కాదంటే కోరుకొనే సత్తనే
ప్రేమ ఎంత గొప్పదైన
పెళ్లి తరువాత తప్పేనే చిన్నదానా
చావులేని భారమైన పెళ్ళైతే ఒప్పుకోరు ఒక్కరైనా
అన్నం వండిపెట్టాలా చెప్పే
అమ్మలాగా చూడాలా చెప్పే
అంతేగాని సోపాతే వద్దని వెళ్ళిపోయి
ఏదన పెంచకు నొప్పే
నాది ప్రేమ కాదా చేప్పే
నాకు గుండె లేదా చెప్పే
తల్లిలాగా నువ్వొచ్చిన మల్లి
వెళ్లానంటూ నవ్వుకునావు ఒప్పే
న్యాయమేన చెలి
ప్రాణంగా ప్రేమిస్తే పిచోడ్ని చేసుడు
న్యాయమేన చెలి
బంగారమనుకుంటే నన్ను బాధపెట్టుడు
న్యాయమేన చెలి
చినుకు నువ్వనుకుంటే మంటల్లోకి నెట్టుడు
న్యాయమేన చెలి
మాణిక్యమనుకుంటే నన్ను మోసగించుడు
______________________________________
పాట పేరు : న్యాయమేనా చెలి లవ్ ఫెయిల్యూర్ సాంగ్ ( Nyayamena Cheli Love Failure Song)
సంగీతం :- మదీన్ SK ( Madeen SK )
సాహిత్యం : సాయి ప్రసాద్ పూజారి (Sai Prasad Poojari )
గాయకుడు: హన్మంత్ యాదవ్ (Hanmanth Yadav )
నటీనటులు : పూజా నాగేశ్వర్ (Pooja Nageshwar), అక్షిత్ మార్వెల్ (Akshith Marvel), రౌడీ హరీష్ (Rowdy Harish )
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసంతెలుగు రీడర్స్ లిరిక్స్‌ను చూడండి.