“న్యాయమే నీకు కాదు” పాటను దిలీప్ దేవగన్ రచించగా, వెంకట్ అజ్మీరా సంగీతం అందించారు. మామిడి మౌనిక గాత్రంలో ఈ పాట భావోద్వేగాలతో నిండిన సంగీత అనుభూతిని అందిస్తుంది. గను, రౌడీ మేఘన ప్రధాన పాత్రల్లో కనిపించగా, మోహన్ మర్రిపెల్లి దర్శకత్వం వహించారు. ఈ పాట ప్రేమ, నమ్మకం, మోసం, బాధల భావాలను హృదయాన్ని హత్తుకునేలా వ్యక్తీకరిస్తుంది.
Nyayame Neeku Kadhu Song lyrics:
ఒక్కనాడు కూడా అయిమన్నా నిద్దుర నా కన్ను తీయలేదు
నిన్ను తలుసుకొని ఏడిస్తే నీ చెయ్యి నా చెంప తుడవలేదు
ఒక్కనాడు కూడా అయిమన్నా నిద్దుర నా కన్ను తీయలేదు
నిన్ను తలుసుకొని ఏడిస్తే నీ చెయ్యి నా చెంప తుడవలేదు
తప్పు ఎవరిదిరా కన్నా వద్దంటూ వదిలేసి పోతున్నావు
తండ్లాట పడుతున్న నాన్న సావంచు దారుల్లా నా ప్రాణము
న్యాయమే న్యాయమే న్యాయమే నీకు గాదు
నన్ను చూసి నవ్వుకుంటున్నావు
గుండెగోస చిన్నది గాదు
చూస్తూవున్నాడు ఆ దేవుడు
న్యాయమే నీకు గాదు
నన్ను చూసి నవ్వుకుంటున్నావు
గుండెగోస చిన్నది గాదు
చూస్తూవున్నాడు ఆ దేవుడు
కట్టు బట్టలతోటి కదిలి వచ్చిన గదరా
నిన్నే నమ్ముకొని..
కొండంతా ప్రేమని పెంచుకున్నా గదరా
నువ్వే ప్రాణమని..
అంచనేయబోకే వంచన ప్రేమని అన్న పట్టించుకొని
అడుగులేసిన గదరా బలగాన్ని గాదని నువ్వే అన్నీ అని..
కన్నోలనే కాదనుకున్నా నీ తోడునే నే కోరుకున్నా
అయినోళ్ళనే వదిలేసుకున్నా అన్ని నువ్వని అనుకున్నా
గుండె కోత పెడుతున్నావు నీకు జాలన్నదే లేదురా
న్యాయమే న్యాయమే న్యాయమే నీకు గాదు
నన్ను చూసి నవ్వుకుంటున్నావు
గుండెగోస చిన్నది గాదు
చూస్తూవున్నాడు ఆ దేవుడు
న్యాయమే నీకు గాదు
నన్ను చూసి నవ్వుకుంటున్నావు
గుండెగోస చిన్నది గాదు
చూస్తూవున్నాడు ఆ దేవుడు
ఎవరు చూపని నాకు గంత ప్రేమ నాపై ఎందుకు చూపినావు
ఒట్టులన్నీ వట్టి మాటలేనా తట్టుకోలేక పోతున్నాను
మట్టిల కలిసేటి ఈ పేయిపై నీకు ఇంతటి అశెందుకు
సచ్చెదాక నాకు ఇచ్చిపోతివిరా ఇంతటి బాదేందుకు
నాలుగుట్ల నన్ని నిలబెట్టి నవ్వుల పాలు చేస్తివి
బాధలేని బతుకురా నాది ఆశ చూపి గోస పెడితివి
నువ్వు చేసిన మోసం నీకేదో రోజు ఎదురుపడతాదిరా
న్యాయమే న్యాయమే న్యాయమే నీకు గాదు
నన్ను చూసి నవ్వుకుంటున్నావు
గుండెగోస చిన్నది గాదు
చూస్తూవున్నాడు ఆ దేవుడు
న్యాయమే నీకు గాదు
నన్ను చూసి నవ్వుకుంటున్నావు
గుండెగోస చిన్నది గాదు
చూస్తూవున్నాడు ఆ దేవుడు
Song Lyrics:
సాంగ్ : న్యాయమే నీకు కాదు (Nyayame Neeku Kadhu)
సాహిత్యం: దిలీప్ దేవగన్ (Dilip Devgan)
గాయని : మామిడి మౌనిక (Mamidi Moounika)
సంగీతం: వెంకట్ అజ్మీరా (Venkat Ajmeera)
నటీనటులు: గను- రౌడీ మేఘన (Ganu- Rowdy Meghana)
దర్శకుడు: మోహన్ మర్రిపెల్లి (Mohan Marripelli)
“న్యాయమే నీకు కాదు” పాట వివరాలు:
ఈ పాట భావోద్వేగాలను వ్యక్తపరిచేలా రాసి, గాత్రాన్ని సృజనాత్మకంగా వినిపించేలా రూపొందించబడింది. ప్రేమ, నమ్మకం, మోసం, బాధల వంటి భావోద్వేగాలను ఇందులో చక్కగా వ్యక్తీకరించారు. పాట సాహిత్యంలో విశ్వాసభంగం, గాయపడిన మనసు, దేవుడిపై నమ్మకం వంటి అంశాలు నడుస్తూ ఉంటాయి.
పాటకు ఇచ్చిన సంగీతం దీనికి తగినట్లుగా, ఆవేశభరితంగా ఉండి, గాయని మామిడి మౌనిక గాత్రం దీనికి మరింత ప్రాణం పోసింది. సినిమా లేదా ఆల్బమ్ నేపథ్యం గురించి ఎక్కువగా తెలియకపోయినా, ఈ పాటలోని లోతైన భావోద్వేగాలు శ్రోతలను బాగా ఆకర్షిస్తున్నాయి.
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగురీడర్స్ లిరిక్స్ ను చూడండి.