ఒక్కనాడుగూడ హాయిమన్న నిదుర నా కన్నుదియ్యలేదే
నిన్నుదలుసుకోని ఏడిస్తె నీ సెయ్యి నా సెంప దుడవలేదే
ఒక్కనాడుగూడ హాయిమన్న నిదుర నా కన్నుదియ్యలేదే
నిన్నుదలుసుకోని ఏడిస్తె నీ సెయ్యి నా సెంప దుడవలేదే
తప్పు ఎవరిదే బొమ్మా వద్దంటు వదిలేసి పోతున్నవు
తండ్లాటవడుతున్ననమ్మా సావంచు దారుల్లొ నా పాణము
న్యాయమే న్యాయమే న్యాయమే నీకు గాదు
నన్ను చూసి నవ్వుకుంటున్నవు
గుండెగోస సిన్నది గాదు చూస్తు ఉన్నడే ఆ దేవుడు
న్యాయమే న్యాయమే న్యాయమే నీకు గాదు
నన్ను చూసి నవ్వుకుంటున్నవు
గుండెగోస సిన్నది గాదు చూస్తు ఉన్నడే ఆ దేవుడు
కన్న ప్రేమను నేను కళ్ళజూడలెగదనె నీ మాయలోనెపడి
కొండంత ప్రేమను వెంచుకున్నగదనె నువ్వే ప్రాణమని
నువ్వు తప్ప నాకు వేరే లోకమంటులేనీ పిచ్చోడిని
మనసునీకు ఎట్ల ఒప్పెనమ్మా నడుమ నన్నిడిసిపోవాలని
అమ్మ ఓలె నినుచూసుకున్నా అన్నీ నువ్వనీ అనుకున్నా
మనసుమీద మన్నోసుకున్నా ఆగమైతననుకున్నానా
గుండెగోస వెడుతున్నావే నీకు జాలన్నదే లేదులే
న్యాయమే న్యాయమే న్యాయమే నీకు గాదు
నన్ను చూసి నవ్వుకుంటున్నవు
గుండెగోస సిన్నది గాదు చూస్తు ఉన్నడే ఆ దేవుడు
న్యాయమే న్యాయమే న్యాయమే నీకు గాదు
నన్ను చూసి నవ్వుకుంటున్నవు
గుండెగోస సిన్నదిగాదు చూస్తుఉన్నడే ఆ దేవుడు
ఎవరు చూపని నాపై గంత ప్రేమ నాకు ఎందుకు చూపినవు
ఒట్టులన్ని వట్టి మాటలేన తట్టుకోలేకపోతున్నను
మాయ మాటలు చెప్పి మనసు చంపినావు ఇంతటి కక్ష్యెందుకు
సచ్చేదాక నాకు ఇచ్చిపోతివి గదనె ఇంటి బాధెందుకు
నలుగుట్లో నను నిలబెట్టి నవ్వులాపాలు చేస్తివి
బాధలేని బతుకే నాది ఆశచూపి గోశపెడితివి
నాకు జేసినా మోసం ఇంకోడికైతే చెయ్యబోకే
న్యాయమే న్యాయమే న్యాయమే నీకు గాదు
నన్ను చూసి నవ్వుకుంటున్నవు
గుండెగోస సిన్నది గాదు చూస్తు ఉన్నడే ఆ దేవుడు
న్యాయమే న్యాయమే న్యాయమే నీకు గాదు
నన్ను చూసి నవ్వుకుంటున్నవు
గుండెగోస సిన్నది గాదు చూస్తు ఉన్నడే ఆ దేవుడు
_____________
సాంగ్ : న్యాయమే నీకు కాదు – పార్ట్ 2 (Male Version)
సాహిత్యం & గాయకుడు: దిలీప్ దేవగన్ (Dilip Devgan)
సంగీతం: వెంకట్ అజ్మీరా (Venkat Ajmeera)
నటీనటులు: ఈశ్వర్ సాయి (Eshwar Sai), బ్రమరాంబిక (Bramarambika)
దర్శకుడు: మోహన్ మర్రిపెల్లి (Mohan Marripelli)
Nyayame Neeku Kadhu female version
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.
