నువ్వు నేను ఒకటై సాగే
కాలం మనదే కాదా
అడుగు అడుగు జతగా మారె
సమయం ఎదురై రాదా
మన్నులో మిన్నులో స్వప్నలే పరిచేద్దాం
నీతో స్నేహం నాలో చిగురించే బంధం
మనసే ఎగసేటి సంద్రం నీ ప్రేమే నా తీరం
నా కళ్లలో ఈ లోకమే మరిందిలా నీ రూపమై
ప్రాణం నీతో చేరే కౌగిలి లా కొలిగా ఒదిగే
కలిసేటి నయనాలే వీడలేని పయణలై
కాలాలు దాటేద్దాం… కలలన్ని గెలిచేద్దాం
హృదయాల సవ్వడి లో ఉదయాలు మానమౌదాం
నింగి నేల నిలిచే దాకా
మన స్నేహం మన బంధం
నిలవాలి చిరకాలం
నీతో స్నేహం నాలో చిగురించే బంధం
మనసే ఎగసేటి సంద్రం నీ ప్రేమే నా తీరం
మౌనం పలికే భాషే నీ తలపే చెలియా
కలిసేటి సమయాలే కరిగేటి దూరలై
మేఘం లా వర్షిద్దాం… మొలకేత్తే ప్రేమౌదాం
చిరుగాలి పల్లకిలో…… పక్షుల్లా ఎగిరేద్దాం
కలలే నిజమై కురిసే జల్లు
నీ జతలో ఈ మజిలీ పూచేటి హరివిల్లు
నీతో స్నేహం నాలో చిగురించే బంధం
మనసే ఎగసేటి సంద్రం నీ ప్రేమే నా తీరం
నా కళ్లలో ఈ లోకమే మరిందిలా నీ రూపమై……ఆ
__________________________
సాంగ్: నువ్వు నేను(Nuvvu Nenu)
చిత్రం: ఒసేయ్ అరుంధతి (Osey Arundhathi)
గాయకుడు: అనురాగ్ కులకర్ణి (Anurag Kulkarni)
సంగీతం: సునీల్ కశ్యప్ (Sunil Kashyap)
తారాగణం: మోనికా చౌహాన్ (Monika Chauhan), కమల్ కామరాజు (Kamal Kamaraju),
నిర్మాత: గూడూరు ప్రణయ్ రెడ్డి (Gudur Pranay Reddy)
దర్శకుడు: విక్రాంత్ కుమార్ (Vikrant Kumar)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.