హే మబ్బులోన దాగి ఉన్న చందమామ
నిన్ను మించే అందముంది చూడవమ్మా
కళ్ళు చూసి కుళ్ళుకోదా కలువభామ
ఆమె ముందు ఎవ్వరైనా నిలవరమ్మా ఓయ్
ఆకాశం నేలకు వచ్చింది
చిరుజల్లుగ మారి నాతోటి చిందులు వేసింది
ఆనందం అంచులు దాటింది
మరుమల్లెగ మారి నీకోసం పల్లవి పాడింది
నా గుండెలో ఈ ఊపిరి నీ పేరులే అడిగింది
నా కళ్ళలో ఈ కాంతిని నువ్వేనని తెలిపింది
పరిచయమెరుగని తొలి తొలి వయసుని పిలిచి మనసుపడని
నువ్వు నాకు మనసిస్తే నిను చేరుకుంటా
మరి కాస్త చనువిస్తే నీ సొంతమవుతా
ఆకాశం నేలకు వచ్చింది
చిరుజల్లుగ మారి నాతోటి చిందులు వేసింది
నిన్ను చూసిన నిమిషంలో అద్దమంటి నా హృదయంలో
అలజడి రేగింది పులకలు రేపింది
ఎంత చెప్పినా వినకుండా ఏరులాగ నా మనసంతా
గల గల పారింది ఉరకలు వేసింది
నీ ఊసులే నాతో ఇలా చెప్పిందిలే చిరుగాలి
నాతో మరి దోబూచులా రావే ఇలా ఒకసారి
వివరములడగక ఎదురుగ నిలబడు కలల తెరలు వదిలి
నువ్వు నాకు మనసిస్తే నిను చేరుకుంటా
మరి కాస్త చనువిస్తే నీ సొంతమవుతా
హే.. ఆకాశం నేలకు వచ్చింది
చిరుజల్లుగ మారి నాతోటి చిందులు వేసింది
ఏలేలో ఏలేలో రామసక్కని కుర్రాడే
ఏ ఊరి పిల్లాడో రాసలీలకు వచ్చాడే
పచ్చని పంటల్లో ఎన్నో ముచ్చటలాడాడే
చల్లని గుండెల్లో ఆడే చిచ్చునే రేపాడే
నాకోసం పుట్టాడొయమ్మా ఈ అల్లరి వాడు
మనసంతా దోచాడోయమ్మా..
హే.. వానవిల్లులో మెరుపంతా నీ ఒంపుసొంపులో గమనించా
తళుకుల చిరునామా నువ్వేలే మైనా
సంధ్య పొద్దులో ఎరుపంతా నీ పాల బుగ్గలో చిటికంతా
తెలియని బిడియాలే ఒదిగెను నీలోనా
నీ నవ్వుతో పున్నాగమే పూచిందిలే సుకుమారి
నీ రాకతో నా జన్మకే వెలుగొచ్చనే తెలవారి
ఉరుకుల పరుగుల పరువపు వయసుని చెలియ వెంటపడని
నువ్వు నాకు మనసిస్తే నిను చేరుకుంటా
మరి కాస్త చనువిస్తే నీ సొంతమవుతా
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.