సిన్నోడా ఓ సిన్నోడా సిన్న సిన్న మేడ
సిత్తరంగ జూపిస్తాది సంబరాల జాడ
సిన్నోడా ఓ సిన్నోడా సిన్న సిన్న మేడ
సిత్తరంగ జూపిస్తాది సంబరాల జాడ
ఎగిరి దూకితే అంబరమన్దదా
ఇంతకు మించినా సంబరముంటదా
ఎన్నడు చూడని ఆనందములోనా
రేలా రేలా రేలా రేలా మనసు ఉరకలేసేనా
అంతే లేని సంతోషాలు మన సొంతమయ్యెనా
సిన్నోడా ఓ సిన్నోడా సిన్న సిన్న మేడ
సిత్తరంగ జూపిస్తాది సంబరాల జాడ
వేల వేల వెన్నెలలే నవ్వులుగా మారి
పెదవుల పైనే వీరబూసాయేమో
చుట్టు ఉన్నా వాల్లె నీ చుట్టాలు ఈడ
ఇంత కన్న స్వర్గం ఇంకెడా లేదో
ఇల్లే జూస్తే ఇరుకురో
అల్లుకున్న ప్రేమలు చెరుకురో
తన హృదయం ఓ కోటరో నువ్వే దానికి రారాజు రో
రేలా రేలా రేలా రేలా రెక్కల గుర్రం ఎక్కాల
లెక్కే లేని ఆనందనా సుక్కలు తెంపుకురావాలా
నువ్వు కన్న కలలే నిజమౌతాయి చూడు
అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు
దశరథ మహారాజే నాన్నయ్ పుట్టాడు
నువ్వు రాముడంత ఎదగరా నేడు
చరితలు ఎన్నడు చూడని మమతల గూడె మీదిరో
సంపద అంటే ఏదో కాదురో ఇంతకు మించి ఏది లేదురో
రేలా రేలా రేలా రేలా నీదే నింగి నేలా
నిత్యం పండగల్లె బతుకు జన్మే ధన్యమయ్యేలా
సిన్నోడా ఓ సిన్నోడా సిన్న సిన్న మేడ
సిత్తరంగ జూపిస్తాది సంబరాల జాడ
ఎగిరి దూకితే అంబరమన్దదా
ఇంతకు మించినా సంబరమున్నదా
ఎన్నడు చూడని ఆనందములోనా
రేలా రేలా రేలా రేలా మనసు ఉరకలేసేనా
అంతే లేని సంతోషాలు మన సొంతమయ్యెనా
_______________________
సాంగ్ రేలా రేలా (Rela Rela)
గాయకుడు: మంగ్లీ (Mangli)
సంగీతం & సాహిత్యం: చరణ్ అర్జున్ (Charan Arjun)
తారాగణం – సముద్రఖని (Samuthirakani),
రచన & దర్శకత్వం : శివ ప్రసాద్ యానాల (Siva Prasad Yanala)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.