నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని
నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని
ఎవరికి చెప్పుకోను నాకు తప్ప
కన్నులకు కలలు లేవు నీరు తప్ప
నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని
నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని
ఎవరికి చెప్పుకోను నాకు తప్ప
కన్నులకు కలలు లేవు నీరు తప్ప
మనసూ ఉంది మమత ఉంది పంచుకొనే నువ్ తప్ప
ఊపిరి ఉంది ఆయువు ఉంది ఉండాలనే ఆశ తప్ప
ప్రేమంటేనే శాశ్వత విరహం అంతేనా
ప్రేమిస్తేనే సుధీర్గ నరకం నిజమేనా
ఎవరిని అడగాలి నన్ను తప్ప
చివరికి ఏమవాలి మన్ను తప్ప
నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని
నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని
వెంటొస్తానన్నావు వెళ్ళొస్తానన్నావు జంటై ఒకరి పంటై వెళ్ళావు
కరుణిస్తానన్నావు వరమిస్తానన్నావు బరువై మెడకు ఉరివై పొయావు
దేవత లోను ద్రొహం ఉందని తెలిపావు
దీపం కూడా దహిఇస్తుందని తేల్చావు
ఎవరిని నమ్మాలి నన్ను తప్ప
ఎవరిని నిందించాలి నిన్ను తప్ప
నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని
నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని
ఎవరికి చెప్పుకోను నాకు తప్ప
కన్నులకు కలలు లేవు నీరు తప్ప
_____________________
సాంగ్ : నువ్వంటే ప్రాణమని (Nuvvante Pranamani)
సినిమా పేరు: నా ఆటోగ్రాఫ్ (Naa Autograph)
లిరిక్స్ : చంద్రబోస్ (Chandrabose)
గాయకుడు : విజయ్ ఏసుదాస్ (Vijay Yesudas)
నిర్మాత: బెల్లంకొండ సురేష్ (Bellamkonda Suresh)
దర్శకుడు: ఎస్.గోపాల్ రెడ్డి (S.Gopal Reddy)
నటులు : రవితేజ (Ravi Teja), భూమిక (Bhoomika), గోపిక (Gopika)
సంగీత దర్శకుడు: ఎం.ఎం.కీరవాణి (M.M.Keeravani)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.