Home » నువ్వంటే నాకిష్టమని – సంతోషం

నువ్వంటే నాకిష్టమని – సంతోషం

by Rahila SK
0 comment
393

పాట: నువ్వంటే నాకిష్టమని
గాయకులు: రాజేష్, ఉష
గీతరచయిత: సిరివెన్నెల సీతారామశాస్త్రి
చిత్రం: సంతోషం (2002)
సంగీత దర్శకుడు: R.P పట్నాయక్
తారాగణం: గ్రేసీ సింగ్, నాగార్జున, శ్రియ శరణ్


నువ్వంటే నాకిష్టమని అన్నది నాప్రతి శ్వాస
నువ్వేలే నా లోకమని అన్నది నాప్రతి ఆశ
నీ నవ్వులో శృతి కలిపి పాడగా
నీ నీడలో అణువణువు ఆడగా
అనురాగం పలికింది సంతోషం స్వరాలుగా
నువ్వంటే నాకిష్టమని అన్నది నాప్రతి శ్వాస
నువ్వేలే నా లోకమని అన్నది నాప్రతి ఆశ

నువ్వునా వెంట ఉంటే అడుగడుగునా నడుపుతుంటే
ఎదురయే నా ప్రతి కలా నిజమల్లే కనిపించదా
నిన్నలా చూస్తూ ఉంటే మైమరపు నన్నల్లుతుంటే
కనపడే నిజమే ఇలా కలలాగ అన్పించదా
వరాలన్ని సూటిగా యిలా నన్ను చేరగా
సుదూరాల తారక సమీపాన వాలగా
లేనేలేదు యింకే కోరిక

నువ్వంటే నాకిష్టమని అన్నది నాప్రతి శ్వాస
నువ్వేలే నా లోకమని అన్నది నాప్రతి ఆశ

ఆగిపోవాలి కాలం మన సొంతమై ఎల్లకాలం
నిన్నగా సనసన్నగా చేజారి పోనీయకా
చూడునా యింద్రజాలం వెనుతిరిగి వస్తుంది కాలం
రేపుగా మనపాపగా పుడుతుంది సరికొత్తగా
నీవ్వు నాకు తోడుగా నేను నీకు నీడగా
ప్రతీ రేయి తీయగా పిలుస్తోంది హయిగా
ఇలా ఉండిపోతే చాలుగా

నువ్వంటే నాకిష్టమని అన్నది నాప్రతి శ్వాస
నువ్వేలే నా లోకమని అన్నది నాప్రతి ఆశ
నీ నవ్వులో శృతి కలిపి పాడగా
నీ నీడలో అణువణువు ఆడగా
అనురాగం పలికింది సంతోషం స్వరాలుగా
నువ్వంటే నాకిష్టమని అన్నది నాప్రతి శ్వాస
నువ్వేలే నా లోకమని అన్నది నాప్రతి ఆశ

మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

Exit mobile version