పాట: నిన్ను చూసే ఆనందంలో
లిరిసిస్ట్: అనంత శ్రీరామ్
గాయకులు: సిద్ శ్రీరామ్
కథ రాయడం మొదలుకాకముందు అపుడే ఎలాంటి మలుపో
కల దేనికో తెలుసుకోకముందు అపుడే ఇదేమి తలపో
నిను చూసే ఆనందంలో
కనుపాపే కడలై పొంగినదే
నిను తాకే ఆరాటంలో
నను నేనే వదిలేశాను కదే
అరె భారమెంత నువు మోపినా మనసు తేలికౌతూ ఉందే
నిను చూసే ఆనందంలో
కనుపాపే కడలై పొంగినదే
కథ రాయడం మొదలుకాకముందు అపుడే ఎలాంటి మలుపో
అణువణువున ఒణుకు రేగినది
కనబడదది కనులకే
అడుగడుగున అడుగుతోంది మది
వినబడదది చెవులకే
మెదడుకు పది మెలికలేసినది
తెలియనిదిది తెలివికే
ఇదివరకెరుగనిది ఏమిటిది
నిదరయినది నిదరకే
తడవ తడవ గొడవాడినా
తగని తగువు పడినా
విడిగ విడిగ విసిగించినా
విడని ముడులు పడెనా
నిను చూసే ఆనందంలో
కనుపాపే కడలై పొంగినదే
నిను తాకే ఆరాటంలో
నను నేనే వదిలేశాను కదే
అరె భారమెంత నువు మోపినా మనసు తేలికౌతూ ఉందే
నిను చూసే ఆనందంలో
కనుపాపే కడలై పొంగినదే
కథ రాయడం మొదలుకాకముందు అపుడే ఎలాంటి మలుపో
ఒకటొకటిగ పనులు పంచుకొని
పెరిగిన మన చనువుని
సులువుగ చులకనగా చూడకని
పలికెను ప్రతి క్షణమిలా
ఒకటొకటిగ తెరలు తెంచుకొని
తరిగిన మన వెలితిని
పొరబడి నువు మరల పెంచకని
అరిచెను ప్రతి కణమిలా
వెతికి వెతికి బతిమాలినా
గతము తిరగబడదే
వెనక వెనక అణిచేసినా
నిజము మరుగుపడదే
నిను చూసే ఆనందంలో
కనుపాపే కడలై పొంగినదే
నిను తాకే ఆరాటంలో
నను నేనే వదిలేశాను కదే
అరె భారమెంత నువు మోపినా మనసు తేలికౌతూ ఉందే
నిను చూసే ఆనందంలో
కనుపాపే కడలై పొంగినదే
కథ రాయడం మొదలుకాకముందు అపుడే ఎలాంటి మలుపో..
మరిన్ని పాటల సాహిత్యం కొరకు తెలుగు రీడర్స్ ను సందర్శించండి.