Home » కొత్త డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ v/s పాత డిప్యూటీ సీఎంలు 

కొత్త డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ v/s పాత డిప్యూటీ సీఎంలు 

by Lakshmi Guradasi
0 comment

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జూన్ 19, 2024 న గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రిగా – ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన తరువాత మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఉద్యానవన పనులకు నిధులు, గిరిజన ప్రాంతాల్లో గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి సంబంధించిన ఫైళ్లపై కళ్యాణ్‌ సంతకం చేశారు.

ఉప ముఖ్యమంత్రి: పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి లేని సమయంలో, ఉపముఖ్యమంత్రి క్యాబినెట్ సమావేశాలకు అధ్యక్షత వహించవచ్చు మరియు అసెంబ్లీ మెజారిటీకి నాయకత్వం వహించవచ్చు.

పవన్ కళ్యాణ్ గారు మాజీ డిప్యూటీ సీఎం లతో పోటీ !

ఆంధ్రప్రదేశ్‌లో ఉప ముఖ్యమంత్రులుగా  పనిచేసిన మాజీ ఉప ముఖ్యమంత్రులతో  , ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ప్రముఖ నటుడు మరియు రాజకీయ నాయకుడు అయిన పవన్ కళ్యాణ్‌తో పోల్చడం: 

1.పిల్లి సుభాష్ చంద్రబోస్

2.అంజాద్ భాషా షేక్ బెపారి

3.కె. నారాయణ స్వామి

4.పాముల పుష్ప శ్రీవాణి

5.ఆళ్ల నాని

6.బుడి ముత్యాల నాయుడు

7.కొట్టు సత్యనారాయణ

8.పీడిక రాజన్న దొర

9.ధర్మాన కృష్ణ దాస్

ఈ 9 మంది మాజీ ఉప ముఖ్యమంత్రులు గా జూన్ 2019 – 2024 వరకు వారి వారి ప్రాంతీయ రాజకీయాలు, సమాజ సేవ మరియు శాసన విధులలో నుండి రాజకీయాలలో పనిచేసారు. రాజకీయ ప్రభావం మరియు పార్టీ అనుబంధం తో తమను తాము స్థాపించుకున్నారు. వారు తమ నియోజకవర్గాలు లేదా ప్రాంతాలలో వివిధ స్థాయిలలో ప్రజాదరణ మరియు గుర్తింపును కలిగి ఉండవచ్చు, ఎన్నికైన ప్రతినిధులుగా వారి వారి పనులను చేసారు. వివిధ పార్టీ అనుబంధాలు, ప్రాంతీయ డైనమిక్స్ మరియు స్వయ ఆలోచనల ద్వారా పైకి వచ్చారు. రోడ్లు మరియు బిల్డింగ్లు మంత్రిలుగా , దేవాదాయ శాఖ మంత్రి గా పనిచేసారు. మరియు రైతుల నీటి సరఫరా కోసం, పిల్లల విద్య కోసం కూడా ఎంతో కృషి చేసారు. భూములు, ఇళ్లపట్టాలు ప్రజల సొంత ఇళ్ల కల విషయం లో మాజీ ముఖ్యమంత్రి జగన్ గారి తో కలిసి ప్రోత్సహించారు.

కానీ 9 మంది ఉండి కూడా చేయవలసిన కార్యక్రమాలను చేయలేకపోయారు. పవన్ కళ్యాణ్ ఆయన తన పార్టీ ద్వారా రైతుల హక్కులు, యువత ఉపాధి, సామాజిక న్యాయం వంటి సమస్యల కోసం వాదించారు. అతని నాయకత్వ శైలి ప్రజలతో ప్రత్యక్షంగా నిమగ్నమై ఉండటం మరియు రాజకీయ చర్చల పట్ల సంప్రదాయ విధానం. అతను ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయక చర్యలకు సహకరించాడు మరియు వెనుకబడిన వర్గాలకు మద్దతు ఇచ్చాడు. ఆడపిల్లలకు న్యాయం చేకూరే పోరాటాలు , పర్యావరణ రహిత  కార్యక్రమాలు మరియు హెల్త్‌కేర్ ఇనిషియేటివ్‌లు, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య చికిత్సల సదుపాయాల అభివృద్ధికి, ఆర్థిక సహాయం అందించడంతో సహా ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలకు ఆయన మద్దతు ఇచ్చారు. 

ఎన్నో సవాళ్లు మరియు విమర్శలు, సమస్యలు, సవాళ్లు ఎదర్కొని జనసేన పార్టీ కి అధ్యక్షుడిగా చేస్తున్నాడు. 5 ఏళ్లలో 9 మంది డిప్యూటీ సీఎం చేయలేని కార్యక్రమాలు. పవన్ కళ్యాణ్ ఒక సామాన్యుడిగా అంతో మంది ప్రజలకు సహాయం చేసాడు. రాబోయే 5 ఏళ్లలో ఇంకెన్ని కార్యక్రమలు చేస్తాడో.

పవన్ కళ్యాణ్: అతను సామాజిక న్యాయం, వ్యవసాయం మరియు యువత సమస్యలపై దృష్టి సాదించాడు, పాలనలో మార్పు కోసం తరచుగా వాదించాడు. ధర్మాన కృష్ణ దాస్ YSRCP ప్రభుత్వంలో పాలన మరియు పరిపాలనా పాత్రలలో లోతుగా నిమగ్నమై ఉండగా, పవన్ కళ్యాణ్ యొక్క ప్రభావం ప్రముఖ నటుడిగా మరియు రాజకీయ నాయకుడిగా తన పార్టీ, జనసేన పార్టీ ద్వారా మార్పు కోసం ప్రయత్నిస్తున్నాడు.

మట్టి గణపతినే పూజించండి: పవన్ కళ్యాణ్  ప్రభుత్వం రాగానే మొదటి పండగ వినాయకచవితి, పిఠాపురం లో 100 మట్టి విగ్రహాలని తయ్యారు చేసి అక్కడా వున్నా యువకులకు ఎక్కువ పోటీ అనేది పెట్టి భక్తిశ్రద్ధలతో పూజ చేసి నిమర్జమం చేస్తే, పర్యావరణ రహితంగా ఉంటుందని పనులు మొదలు పెట్టారు. ఇంతవరకు భారతదేశం లో ఎక్కడ ఇలా చేయలేదు. మరొకటి చేతి సంచితో బజారుకు వెళదాం, ఒకప్పుడు 40  క్రితం ఇలా అలవాటు ఉండేది. పిఠాపురం అనే పేరుతోనే ఇవన్ని తాయారు చేస్తున్నారు. ఆలా చేస్తే ఆదాయం వస్తుంది మరియు కొత్తగా ఉంటుంది.  

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ రాజకీయం ను చూడండి.

Leave a Comment