నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడా…..
ఇప్పుడు నువ్వు ఆడ నేను ఈడ
మనకెందుకు అడ్డుగొడ తమ్ముడా…
నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడా…..
ఇప్పుడు నువ్వు ఆడ నేను ఈడ
మనకెందుకు అడ్డుగొడ తమ్ముడా…
చిన్నప్పుడు నీది నాది ఒకటే ఇల్లు
ఇప్పుడు నీ ఇల్లు నా ఇల్లు అంటారే వీళ్ళు
నీ తొడిగిన అంగి లాగే నీకొచ్చేది
ఇప్పుడు నీ దారి నా దారెందుకు వేరయ్యింది
నన్నెవడు ఏమన్న నీ నెత్తురు మరిగేది
ఇపుడెందుకు నీకు నాకు ఈ పంచాయతీ
ఏ బంధం అయినా కలుపుకుంటే మొదలవుతాది
తోబుట్టు బంధం ఒకటే ఇంకేడా దొరకనిది
నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడా…..
ఇప్పుడు నువ్వు ఆడ నేను ఈడ
మనకెందుకు అడ్డుగొడ తమ్ముడా…
వందేళ్లు బతికే వీలు ఉందనుకుంటే
అందులో నువ్వు నేను కలిసే రోజులు ఎన్నుంటాయో
చిన్నప్పుడు తెలిసి తెలియక 20 యేళ్లు
ఇప్పుడు ఈ గోడు గొడవలతోనే ఇంకెన్నాళ్ళు
నీ సంపాదన నీకే నా సంపాదన నాకే
తాత ముత్తాతల సొత్తుకు తగువులు ఏల
నడి మధ్యన వచ్చేది ఏదైనా కొన్నాల్లే
నువ్వేలే నిత్యం ఉండే నింగి నేలా
నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడా…..
ఇప్పుడు నువ్వు ఆడ నేను ఈడ
మనకెందుకు అడ్డుగొడ తమ్ముడా…
నువ్వు నేను అమ్మా నాన్నకి కొనసాగింపు
మనము కొట్లాడి తేవద్దు వాళ్లకు తలవంపు
భార్య మన పిల్లలు అంటే దేవుడి చిత్తం
కానీ అన్న తమ్ముడు అంటే అది ఒకటే రక్తం
ఒక నిమిషం కూర్చుంటే ఒడిసే గొడవే మనది
ఏమున్నది నీకు నాకు అంతటి క్రోధం
అన్నంటే నాన్నంట తమ్ముడు తన కొడుకంట
ఆ సంగతి అర్థమైతే జన్మంతా ఆనందం
నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడా…..
ఇప్పుడు నువ్వు ఆడ నేను ఈడ
మనకెందుకు అడ్డుగొడ తమ్ముడా…
చిన్నప్పుడు నీది నాది ఒకటే ఇల్లు
ఇప్పుడు నీ ఇల్లు నా ఇల్లు అంటారే వీళ్ళు
నీ తొడిగిన అంగి లాగే నీకొచ్చేది
ఇప్పుడు నీ దారి నా దారెందుకు వేరయ్యింది
నన్నెవడు ఏమన్న నీ నెత్తురు మరిగేది
ఇపుడెందుకు నీకు నాకు ఈ పంచాయతీ
ఏ బంధం అయినా కలుపుకుంటే మొదలవుతాది
తోబుట్టు బంధం ఒకటే ఇంకేడా దొరకనిది
_______________
Song Credits:
సాంగ్ : నేనున్న గర్భంలోనే (Nenunna garbham lone)
నటులు: Bvm శివ శంకర్ (Bvm Siva Shankar), Bvm గణేష్ రెడ్డి (Bvm Ganesh Reddy)
సాహిత్యం, గాయకుడు, సంగీతం: చరణ్ అర్జున్ (Charan Arjun)
కాన్సెప్ట్-డైరెక్షన్-ఎడిటింగ్- సురేష్ సూర్య (Suresh surya)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.