Home » నేనే కానీ నేనై ఉండగా సాంగ్ లిరిక్స్ – సికిందర్ (Sikindar)

నేనే కానీ నేనై ఉండగా సాంగ్ లిరిక్స్ – సికిందర్ (Sikindar)

by Lakshmi Guradasi
0 comment

నేనే కాని నేనై ఉండగా
నీ చూపే తాకి ప్రాణమే మరుజన్మే పొందగా
ఎన్నో మార్పులు రానే వచ్చెగా
అవి మారేకొద్దీ అణువణువులో నువ్వే కొత్తగా

ఎందుకో
ఇంతలో
ఎందుకో ఇంతలో అంతటి వింతలే
ప్రేమ మయమే మహిమే మహిలో నిండెలే

తను చిలిపిగ నగవులు చిలికితే
తొలిచనువుల చలువలు సోకితే
అది ఇది అని తెలిసిన తరుణములో మగతే మరి
ఉరికే ఎద కదలిక కుదురిక వీడితే
ఆ పరుగులు పదనిస పాడితే
ఆ శ్రుతిగతి జతపడు ప్రియలయలే నీ ఊపిరి

నేనే కాని నేనై ఉండగా
నీ చూపే తాకి ప్రాణమే మరుజన్మే పొందగా
ఓ ఎన్నో మార్పులు రానే వచ్చెగా
అవి మారేకొద్దీ అణువణువులో నువ్వే కొత్తగా

కనులకల ఎదురైతే కునుకుకిక కుదురేది
కల నిజం యుగం క్షణం నీ చెంతటా ఓ వింతటా
చూపులకు కనబడని రేపటిని చదివె మది
ఊహాలోకం నాముందర కోరిందిలే ఏ తొందర
హద్దుపొద్దులేని వలపు నే పంచనా
చొరవచూపు వేళ నిన్ను నే మించనా
నిన్ను నే మించనా
నీ శ్వాసే నాలో ఉసురై ఉంచనా

తను చిలిపిగ నగవులు చిలికితే
తొలిచనువుల చలువలు సోకితే
అది ఇది అని తెలిసిన తరుణములో మగతే మరి
ఉరికే ఎద కదలిక కుదురిక వీడితే
ఆ పరుగులు పదనిస పాడితే
ఆ శ్రుతిగతి జతపడు ప్రియలయలే నీ ఊపిరి

మనసుపొరలో మాటే పలికినది నీ పాటే
నిరంతరం నీ ధ్యానమే ఇహంపరం నీ కోసమే
అడుగు కోరిన బాటే కడవరకు నీతోటే
ఏ జన్మకీ నీ తోడునే వేడానులే అత్యాశగా
నీకు తెలుపలేని తలపులే వేలులే
నీవు చెంతనుంటే మౌనమే మేలులే
మౌనమే మేలులే
ఈ తహతహ తీర్చగ ప్రేమే చెప్పవా

తను చిలిపిగ నగవులు చిలికితే
తొలిచనువుల చలువలు సోకితే
అది ఇది అని తెలిసిన తరుణములో మగతే మరి
ఉరికే ఎద కదలిక కుదురిక వీడితే
ఆ పరుగులు పదనిస పాడితే
ఆ శ్రుతిగతి జతపడు ప్రియలయలే నీ ఊపిరి

______________________

పాట పేరు – నేనే కానీ నేనై ఉండగా (Nene Kani Nenai Undaga)
చిత్రం – సికిందర్ (Sikindar)
గాయకులు – హరిచరణ్ & దీపక్ (Haricharan & Deepak)
సంగీతం – యువన్‌శంకర్‌రాజా (Yuvanshankar Raja)
సాహిత్యం – రాకేండు మౌళి (Rakendu Mouli)
దర్శకుడు – ఎన్.లింగుస్వామి (N. Linguswamy)
నటీనటులు – సూర్య (Suriya), సమంత (Samantha)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసంతెలుగు రీడర్స్ లిరిక్స్ను చూడండి.

You may also like

Leave a Comment