బుల్లి బుల్లి నా బొండు మల్లీ
బుల్లీ బుల్లీ నా బొండు మల్లీ హాయ్
పాడరట్టి కుంకుమెట్టి ముస్తాబయ్యేస్తే
ఆడుదామే కొక్కో కోలాటం
చీరకట్టి సెంటుకొట్టి నా చెంత కొస్తే
చూపుతాలె కుర్రాడి వాటం
మల్లీ మల్లీ నా మావా మళ్లీ
మళ్లీ మళ్లీ నా మావా మళ్లీ హాయ్
డాబు చాలు గాని బాబూ నీ చెంత కొస్తే
ముగ్గులాగ ముడిచేసుకుంటావ్
గడ్డి వాము చాటు కొచ్చి నే సైగ చేస్తే
సిగ్గుతోటి లగెత్తుకుంటావ్
ఆ పంచ కట్టేసి ఓ పింఛమెడితే
కిట్టయ్య లాగా మా బాగా ఉన్నావే
అందాల రాధమ్మ నువుగాని అయితే
నీ పక్క నేను కిట్టయ్యనౌతాలే
అమ్మదొంగ ఎటకారం వద్దు
ఇంక నాతో చెలగాటం వద్దు
ఒక్కటయ్యే వీలే లేదా
ఓ వెన్నదొంగా ఈ కన్నెబెంగ తీరేది ఎట్టాగా
నా సామిరంగా బంగారు జింకా పట్టింది నేనేగా
బుల్లి బుల్లి నా బొండు మల్లీ
బుల్లీ బుల్లీ నా బొండు మల్లీ
పాడరట్టి కుంకుమెట్టి ముస్తాబయ్యేస్తే
ఆడుదామే కొక్కో కోలాటం
చీరకట్టి సెంటుకొట్టి నా చెంత కొస్తే
చూపుతాలె కుర్రాడి వాటం
నీ నవ్వు ముత్యాలు నే తీసుకెళ్ళి
ముత్యాల హారం చేయించి ఇస్తాలే
నీ సూపు వజ్రాలు నేనేరుకెళ్ళి
అద్దాలమేడ కట్టించి ఇస్తాలే…
అయ్య బాబాయ్ గాలే కొట్టొద్దు
నువ్వు కూడ అట్టే మొయ్యెద్దు
నేనంటేను ప్రేమేలేదా
వయ్యారి బాలా ఓ మేఘమాలా
పండిందే నా పంట
ఓ చందమామా నా మేనమామా
నేనేగా నీ జంటా
బుల్లి బుల్లి నా బొండు మల్లీ
బుల్లీ బుల్లీ నా బొండు మల్లీ హాయ్
పాడరట్టి కుంకుమెట్టి ముస్తాబయ్యేస్తే
ఆడుదామే కొక్కో కోలాటం
Song Credits:
చిత్రం: శ్రీరామ్ (2002)
సంగీతం: ఆర్పీ పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: ఆర్.పి. పట్నాయక్, ఉష
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.