నేలమ్మ తల్లే మా దైవం
ఈ భూమి సిద్దులకి నిలయం అమ్మ
ప్రతి చెట్టు చేమా మా నేస్తం
మా సీమా మూలికల సొంతం
నేలమ్మ తల్లే మా దైవం
ఈ భూమి సిద్దులకి నిలయం
ప్రతి చెట్టు చేమా మా నేస్తం
మా సీమా మూలికల సొంతం
తల్లి ఎల్లమ్మను నోచెము
పోతు రాజొచ్చి కాచెను
బుల్లి మొలకల్లే జీవమల్లె
పచ్చికపై పిచ్చుకల్లే కుండల్లో కూడు
మన్నే మా ఊపిరాన్నం
నీరంట నడిచే తీరయ్యినాం
తీరంతా ఎదిగి ఊరయ్యినాం
ఊరంతా కలిసి ఎరయ్యినాం
ఎరల్లే ఎగిసే హోరయ్యినాం
నేలింట కడకి సాగయ్యినాం
సాగింట ఒదిగి విత్తయ్యినాం
విత్తల్లే ఎదిగి నూరయ్యినాం
వెయ్యేళ్లు నిలిచే వేరయ్యినాం
నేలింట కడకి సాగయ్యినాం
సాగింట ఒదిగి విత్తయ్యినాం
విత్తల్లే ఎదిగి నూరయ్యినాం
వెయ్యేళ్లు నిలిచే వేరయ్యినాం
సింధూర పసుపుల శక్తీ
ఎరిగేది ఉందా నీ బుద్ధి
చెట్టందమించు గోరింట
తాపాన్ని దించు గురువంట
పీత జాతంతా చిందాడే
కొంగే కోలాటం కూడాడే
మోహమే చందంగా ఊయలాడే
జలకాలే చేపలాడే
రాల్లెమ్మట రాతలు రాసి
కథలల్లెను గాలి ధూళి
దైవాలు నడిచిన ఈ నేలలో
జీవాలమైయాం ఓ దారిలో
జ్ఞానాన్ని నేర్చను ధాన్యాలలో
నింగందుకున్నాం ఓ కొంగల
తాటాకు రాతలో లెక్కున్నదా
భాషోక్కటే మన అండాన్నదా
పెద్దోరు పాడని మాటున్నదా
విభూది తీర్చని వ్యాధున్నదా
జొన్ననన్నామో అది సజ్జన్నామో
సక్కంగా తిన్నాం మూపుటలా
కలబంద కడుపుని బతికించదా
కర్పూర గొంతికి తేనవ్వదా
__________________
సాంగ్ : నేలమ్మ తల్లే (Nelamma Thalle)
సినిమా : అగాథియా (Aghathiyaa)
నటీనటులు : అర్జున్ సర్జా (Arjun Sarja), మటిల్డా (Matylda), జీవా (Jiiva), రాసి ఖన్నా (Raasi Khanna),
గాయకుడు: దేవు మాథ్యూ (Devu Mathew)
సంగీత దర్శకుడు: యువన్ శంకర్ రాజా (Yuvan Shankar Raja)
లిరిక్స్ : శశాంక్ వెన్నెలకంటి (Shashank Vennelakanti)
దర్శకుడు: PA. విజయ్ (PA. Vijay)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.