నీవే…
తొలి ప్రణయము నీవే
తెలి మనసున నీవే
ప్రేమ ఝల్లువే
నీవే… నీవే
కలలు మొదలు నీవే
మనసు కడళి అలలు నీవల్లే
కనులు తడుపు నీవే
కలత చెరుపు నీవే
చివరి మలుపు నీవే…
నీవే…
ఎటు కదిలిన నీవే
నను వదిలిన నీవే
ఏదో మాయవే
ప్రెమే…
మది వెతికిన నీడే
మనసడిగిన తోడే
నా జీవమే
నిలువనీదు క్షణమైనా
వదలనన్న నీధ్యాస
కలహమైన సుఖమల్లే
మారుతున్న సంబరం
ఒకరికొకరు యెదురైతే
నిమిషమైన యుగమేగా
ఓక్కొసారి కనుమరుగై
ఆపకింక ఊపిరి
నీవే…
గడిచిన కథ నీవే
నడిపిన విధి నీవే
నా ప్రాణమే
నా పాదం …
వెతికిన ప్రతి తీరం
తెలిపిన శశిదీపం
నీ స్నేహమే..
నీ జతే విడిచే
ఊహనే తాలనులే
వేరొక జగమే
నేనిక ఎరుగనులే
గుండెలోని లయ నీవే
నాట్యమాడు శ్రుతి నేనే
నువ్వు నేను మనమైతే
అదో కావ్యమే
నీవే…
నను గెలిచిన సైన్యం
నను వెతికిన గమ్యం
నీవె నా వరం
ప్రెమే …
తొలి కదలికలోనే
మనసులు ముడివేసే
ఇదో సాగరం
____________
పాట: నీవే (Neeve)
నటీనటులు: నిరంజన్ హరీష్ (Niranjan Harish), శ్రేయ దేశ్‌పాండే (Shreya Deshpande)
సంగీత దర్శకుడు: ఫణి కళ్యాణ్ (Phani Kalyan)
లిరిసిస్ట్: శ్రీజో (Sreejo)
గాయకులు: యాజిన్ నిజార్ (Yazin Nizar), సమీర భరద్వాజ్ (Sameera Bharadwaj)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.