రాతిపురం అనే గ్రామంలో కొండపై రెండు ఊళ్లు ఉన్నాయి. వారు నీటి కోసం నిత్యం ఎన్నో కష్టాలు పడేవారు పక్క కొండపై ఉన్న ఊట నుంచి నీటిని తెచ్చుకోవడానికి త్రీవంగా శ్రమించేవారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ఒక రోజు రెండు ఊళ్లవారు మీటింగ్ పెట్టుకున్నారు. పక్కకొండ నుంచి వైపు ఏర్పాటు చేసుకుంటే ఈ సమస్య పరిష్కారం అవుతుందని. ఒక ఊరు వారు చెప్పగా. రెండో ఊరి వాళ్ల దానిని వ్యతిరేకించారు. పైపు వేయడం చాలా కష్టమైన పని పైగా చాలా సమయం డబ్బు శ్రమ వృథా అవుతుందని. వారు అంగీకరించలేదు. అందుకు తాము సహాయం చేయమని రెండో ఊరి వాళ్లు చెప్పారు. కానీ మొదటి ఊరి వాళ్లు పైపు వేయడం మొదలుపెట్టారు మొదట్లో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కొందరు తీవ్రంగా నష్టపోయారు. వాళ్ల కష్టాలను చూసి రెండో ఊరు వాళ్ల నువ్వ కునేవారు. కొన్ని సంవత్సరాలకు ఎలాగైతే పైపు నిర్మాణం పూర్తయింది. మొదటి ఊళ్లోకి నీళ్లు వచ్చాయి. రెండో ఊరువాళ్లు కష్టపడుతూనే నీళ్ల తెచ్చుకునేవారు వారిని చూసి మొదటి ఊరు వాళ్లకు కూడా తమ నీటిని ఇచ్చారు.
నీతి: కష్టాన్ని చూసి భయపడితే ఎప్పటికీ సుఖం దక్కుదు.
మరిన్ని ఇటువంటి వాటి కోసంతెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.