నీలి మేఘములలో ధరణీ తేజం
నయనాంతరంగములలో వనధీ నాదం
పోరునే గెలుచు పార్ధీవీ
పతి సాటిలేని ఘనుడైనా
నీరజాక్షి అలిగే వేళ
నుడివిల్లు ముడి వంచగలడా
సడే చాలు శత సైన్యాలు
నడిపే ధీరుడైనా
వసుధా వాణి మిథిలా వేణి
మది వెనుక పలుకు
పలుకులెరుగ గలడా
నీలి మేఘములలో ధరణీ తేజం
నయనాంతరంగములలో వనధీ నాదం
జలధి జలముల్ని లాలించు మేఘమే
వాన చినుకు మార్గమును లిఖించదే
స్వయంవరం అనేది ఓ మాయే
స్వయాన కోరు వీలు లేదాయె
మనస్సులే ముడేయు వేళా
ఏశివాస్త్ర ధారణేల కొలాతాయే
వరంధాముడే వాడే
పరం ఏలు పసివాడే
స్వరం లాగ మారాడే
స్వయం లాలి పాడాడే
భాస్కరాభరణ కారుణీ
గుణ శౌరి శ్రీకరుడు వాడే
అవని సూన అనుశోకాన
స్థిమితాన తానుండ లేడే
శరాఘాతమైనా గాని
తొణికే వాడు కాడే
సిరి సేవించి సరి లాలించి
కుశలములు నిలుప ఘనము నొదిలి కదిలే
నీలి మేఘములలో ధరణీ తేజం
నయనాంతరంగములలో వనధీ నాదం
____________________
సాంగ్ : నీలి మేఘముల లో (Neeli Meghamula lo)
సాహిత్యం: భరద్వాజ్ గాలి (Bharadwaj Gali)
గాయకుడు: పృథ్వీ హరీష్ (Prithvi Harish)
సంగీతం: వివేక్ సాగర్ (Vivek Sagar)
చిత్రం : 35 – చిన్న కథ కాదు (35 – Chinna Katha Kaadu)
తారాగణం: నివేదా థామస్ (Nivetha Thomas), విశ్వదేవ్ రాచకొండ (Vishwadev Rachakonda),
రచయిత మరియు దర్శకుడు: నంద కిషోర్ ఈమాని (Nanda Kishore Emani)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.