Home » నీ ప్రశ్నలు నీవే (Nee Prashnalu) సాంగ్ లిరిక్స్ | Kotha Bangaru Lokam

నీ ప్రశ్నలు నీవే (Nee Prashnalu) సాంగ్ లిరిక్స్ | Kotha Bangaru Lokam

by Manasa Kundurthi
0 comments
Nee Prashnalu nive song lyrics Kotha Bangaru Lokam

నీ ప్రశ్నలు నీవే ఎవ్వరో బదులివ్వరుగా
నీ చిక్కులు నీవే ఎవ్వరూ విడిపించరుగా
ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా
ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా

పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా
అపుడో ఇపుడో కననే కనను అంటుందా
ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా
గుడికో జడకో సాగనంపక ఉంటుందా

బతుకంటే బడి చదువా అనుకుంటే అతిసులువా
పొరపడినా పడినా జాలిపడదే కాలం మనలాగా
ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా

అలలుండని కడలేదని అడిగేందుకే తెలివుందా
కలలుండని కనులేవని నిత్యం నిదరోమందా
గతముందని గమనించని నడిరేయికి రేపుందా
గతితోచని గమనానికి గమ్యం అంటూ ఉందా

వలపేదో వల వేస్తుంది వయసేమో అటు తోస్తుంది
గెలుపంటే ఏదో ఇంతవరకు వివరించే రుజువేముంది
సుడిలో పడు ప్రతి నావ చెబుతున్నది వినలేవా

పొరబాటున చెయిజారిన తరుణం తిరిగొస్తుందా
ప్రతిపూటొక పుటలా తన పాఠం వివరిస్తుందా
మనకోసమే తనలో తను రగిలే రవి తపనంతా
కనుమూసిన తరువాతనే పెనుచీకటి చెబుతుందా

కడతేరని పయనాలెన్ని పడదోసిన ప్రణయాలెన్ని
అని తిరగేశాయా చరిత పుటలు వెనుచూడక ఉరికే జతలు
తమ ముందుతరాలకు స్మృతుల చితులు అందించాలా ప్రేమికులు
ఇది కాదే విధిరాత అనుకోదేం ఎదురీత

పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా (అమ్మైనా)
అపుడో ఇపుడో కననే కనను అంటుందా
ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా (కొమ్మైనా)
గుడికో జడకో సాగనంపక ఉంటుందా

బతుకంటే బడి చదువా అనుకుంటే అతిసులువా
పొరపడినా పడినా జాలిపడదే కాలం మనలాగా
ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా…

___________________

పాట: నీ ప్రశ్నలు (Nee Prashnalu)
సినిమా పేరు: కొత్త బంగారు లోకం (Kotha Bangaru Lokam)
గానం: S. P. బాలసుబ్రహ్మణ్యం (S. P. Balasubrahmanyam)
లిరిక్స్ : సిరివెన్నెల సీతారామశాస్త్రి (Sirivennela Seetharama Sastry)
సంగీతం: మిక్కీ జె మేయర్ (Mickey J Meyer)
నటీనటులు: వరుణ్ సందేశ్ (Varun Sandesh), శ్వేతా బసు ప్రసాద్ (Shweta Basu Prasad), జయసుధ (Jayasudha), ప్రకాష్ రాజ్ (Prakash Raj)
దర్శకుడు: శ్రీకాంత్ అడ్డాల (Srikanth Addala)
నిర్మాత: దిల్ రాజు (Dil Raju)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.