ఓ…. నీ చూపే నాకు ఆయుషే పోసే
దూరమైతే అది ఏం కానే… ఏం కానే
ఓ….. నీ నవ్వు నన్ను బానిసే చేసే
స్వేచ్ఛే ప్రసాదిస్తే ఏం కానే… ఏం కానే
నీ తలపులతోనే ఓ సఖియా
నారోజే మొదలవునే సఖియా
ఇక పగలే సెగలే నా సఖియా…..ఆ
సఖియా చెలియా రా… ఆ…
నా గళము స్వరము నీవేగా
నా గానము ధ్యానము నీవేగా
నా బతుకున భావము నీవేగా…. ఆ
నీవే లేక నే లేనే… ఏ…
ఆశైనా ఊసైనా శ్వాసైనా… నీ ధ్యాసే నే
మదిలో నీ గురుతేగా నను నడిపించి మోసేలే…
ఓ …. నీ స్నేహములోనే తేలే నా ప్రాణం
ముంచేసి పోతే ఏం కానే… ఏం కానే
నీ కలలే పూని కళ్ళల్లో
కథగా మిగిలే కల్లల్లో
కలకాలం చితిలో నా సఖియా…
నీవే లేక నే లేనే… ఏ…
______________________
చిత్రం : 99 సాంగ్స్ (99 Songs)
సంగీతం : ఎ.ఆర్.రెహ్మాన్ (A.R. Rahman)
లిరిక్స్ : రాకేండు మౌళి (Rakendu Mouli)
గానం : సిద్ శ్రీరామ్ (Sid Sriram)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.