Home » నన్ను లాలించు సంగీతం నువ్వే కదా సాంగ్ లిరిక్స్ చెప్పవే చిరుగాలి

నన్ను లాలించు సంగీతం నువ్వే కదా సాంగ్ లిరిక్స్ చెప్పవే చిరుగాలి

by Lakshmi Guradasi
0 comments
Nannu Lalinchu song lyrics Cheppave Chirugali

నన్ను లాలించు సంగీతం నువ్వే కదా
నిన్ను పాలించు సంతోషం నేనే కదా
నువ్వు చిరుగాలివా లేక విరివానవా
మరి ఆ నింగి ఈ నేల నిప్పే నువ్వా లేకా నేనే నువ్వా

నన్ను లాలించు సంగీతం నువ్వే కదా
నిన్ను పాలించు సంతోషం నేనే కదా

నదిలాగ నీవు కదలాడుతుంటే
నీతోపాటూ సాగేతీరం నేనవ్వనా
నిశిరాత్రి నీవు నెలవంక నేను
నీతోపాటూ నిలిచే కాలం చాలందునా
మొగ్గై ఎదురొచ్చీ వనముగ మారావూ
కలలే నాకిచ్చీ కనులను దోచావు
ఎదలయలోన లయమయ్యే శృతివే నువ్వు నా బ్రతుకే నువ్వూ

నన్ను లాలించు సంగీతం నువ్వే కదా
నిన్ను పాలించు సంతోషం నేనే కదా

భువిలోన గాలి కరువైన వేళా
నా ప్రాణాన్ని నీ ఊపిరిగా మార్చేయనా
నీలాల నింగీ తెలవారకుంటే
నా జీవాన్నీ నీకూ దివ్వెగ అందించనా
శిలలా మౌనంగా కదలక పడి ఉన్నా
అలలా నువు రాగా అలజడి అవుతున్నా
దీపం నువ్వైతె నీ వెలుగు నేనవ్వనా నీలో సగమవ్వనా

నన్ను లాలించు సంగీతం నువ్వే కదా
నిన్ను పాలించు సంతోషం నేనే కదా
నువ్వు చిరుగాలివా లేక విరివానవా
మరి ఆ నింగి ఈ నేల నిప్పే నువ్వా లేక నేనే నువ్వా

నన్ను లాలించు సంగీతం నువ్వే కదా
నిన్ను పాలించు సంతోషం నేనే కదా

______________________

సాంగ్ : నన్ను లాలించు (Nannu Lalinchu)
గాయకులు: సుజాత (Sujatha)
లిరిక్స్ : శివ గణేష్ (Siva Ganesh)
దర్శకుడు: విక్రమన్ (Vikraman)
నిర్మాత: వెంకట శ్యామ్ ప్రసాద్ (Venkata Shyam Prasad)
సంగీతం: SA రాజ్‌కుమార్ (SA Rajkumar)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.