Home » నమో ఈశ్వరా సాంగ్ లిరిక్స్ – దేవకీ నందన వాసుదేవ

నమో ఈశ్వరా సాంగ్ లిరిక్స్ – దేవకీ నందన వాసుదేవ

by Vinod G
0 comments

వ్యోమకేశ నిటలాక్ష నిశ్చలా
పింగళాక్ష మదనారి అక్షరా
ఆదియోగి అద్వైత భాస్కరా
నమో ఈశ్వరా

ఇందుమౌళి సుఖ శాంతి దాయకా
శూలధారి భవ బంధ నాశకా
కాలకాల కల్పాంత కారకా
నమో ఈశ్వరా

గణ సేవిత ప్రమథ శివా
గుణ నాశక ప్రళయ శివా
అహమొదిలిన మనసున
తొలితొలి వెలుగుగ
అద్వైతపు ప్రభ అద్దరా శివ

లోకమే నీవనీ అంటూ ఉంటారే
లోపల నీవనీ తెలిసేదెలా
నేనని నాదని అంటూ ఉంటారే
నింగిలో ధూళని తెలిసేదెలా

ఓం హరోం హర హ్రామ్ హరోం హర
ఓం హరోం హర హ్రామ్ హరోం హర
హే విశ్వేశ్వర అఘోరా పరా
హరహర మదహర అగహర దేవర
ధర్మవాహనా దక్షజాపతి నీలకంధరా
నకుల దూర్జటి శ్వేతపింగళా
శూలి పశుపతి దేవ దేవ మేరుధన్వి ఝర్ఝరి ఓం

అటు ఉత్తర వాహిని జీవ నది
ఇటు భగభగ వెలుగుల తుది మజిలీ
జీవము నీవే మౌనము నీవే ఈశ్వరా
కాలము కందని జ్యోతివనీ
ఇది చిరమగు స్థిరమగు ధామమనీ
కింకరులై అర్చిస్తున్నాం కరుణించరా

కామ క్రోధమూ లోభ మొహమూ
మదము మత్సరం మాపరా
మనిషి మనిషిగా వెలుగు జగతిలో
కొత్త ఉదయమే చూపరా
జీవ నదములు సుమించు వనములు
స్మశాన విభూది కపాలమొకటే
అన్నరీతి సంచరించు వాడా

శంకరా విశ్వేశ్వర ఓంకారేశ్వర శివంకరా
శంకరా కాశీపురకే నాదేశ్వరా శుభంకరా


చిత్రం:దేవకీ నందన వాసుదేవ (Devaki Nandana Vasudeva)
పాట పేరు:నమో ఈశ్వరా (Namo Eshwara)
తారాగణం:అశోక్ గల్లా (Ashok Galla), మానస వారణాసి (Manasa Varanasi), దేవదత్తా గజానన్ నాగే (Devdatta Gajanan Nage) తదితరులు
గాయకులు:స్వరాగ్ కీర్తన (Swaraag Keerthan)
సాహిత్యం:శ్రీనివాస మౌళి పత్రి (Srinivasa Mouli Patri)
సంగీత దర్శకుడు:భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo)
చిత్ర దర్శకత్వం:అర్జున్ జంధ్యాల (Arjun Jandyala)

మరిన్ని ఇటువంటి వాటి కోసంతెలుగు రీడర్స్ లిరిక్స్ను చూడండి

You may also like

Leave a Comment